ఓటీటీలోకి వచ్చేస్తున్న హిడింబ మూవీ

థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే హిడింబ సినిమా ఓటీటీలోకి అడుపెట్టబోతోంది. ఆగస్టు

Update: 2023-08-07 03:38 GMT

ఓంకార్‌ తమ్ముడు అశ్విన్‌ బాబు హీరోగా నటించిన సినిమా హిడింబ. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై మంచి హైప్‌ తీసుకొచ్చాయి. సినిమా విడుదలయ్యాక మిక్స్డ్‌ రివ్యూలు తెచ్చుకుంది. టాక్‌తో సంబంధంలేకుండా అశ్విన్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఓపెనింగ్స్‌ రాబట్టింది. ఈ సినిమా అశ్విన్‌ కెరీర్‌లో మంచి హిట్ గా రాబట్టింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్‌ చేసుకుంది. తెలుగులో ఓటీటీ సంస్థ 'ఆహా' ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. ఆగస్టు 10 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. అనీల్‌ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీవిఘ్నేష్‌ సినిమాస్‌ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించాడు. అశ్విన్‌కు జోడీగా నందితా శ్వేత హీరోయిన్‌గా నటించింది.

థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే హిడింబ సినిమా ఓటీటీలోకి అడుపెట్టబోతోంది. ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఈ సినిమా ఆహా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ నేడు అధికారికంగా ప్రకటించింది. “హిడింబ.. వేట మొదలుకాబోతోంది. భయపెట్టే బ్లాక్‍బాస్టర్‌కు సిద్ధంగా ఉండండి. హిడింబ మూవీ ఆహాలో ఆగస్టు 10వ తేదీన సాయంత్రం 7 గంటలకు ప్రీమియర్ అవుతుంది” అని ఆహా ఓటీటీ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, మకరండ్ దేశ్ పాండే, సాహితి అవంచ, సంజయ్ స్వరూప్, విద్యుల్లేఖ రామన్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. విఘ్నేశ్ కార్తిక్ సినిమాస్ పతాకంపై శ్రీధర్ గంగపట్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పించారు.


Tags:    

Similar News