హిట్ 2: విశ్వక్ సేన్ తో మరో హీరో?

నాని ప్రొడ్యూసర్ గా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ సినిమా మంచి హిట్ అవడమే కాదు.. ప్రొడ్యూసర్ గా నాని చాలానే వెనకేసుకున్నాడు. [more]

Update: 2020-08-17 04:15 GMT

నాని ప్రొడ్యూసర్ గా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ సినిమా మంచి హిట్ అవడమే కాదు.. ప్రొడ్యూసర్ గా నాని చాలానే వెనకేసుకున్నాడు. అందుకే నాని వెంటనే హిట్ కి సీక్వెల్ గా హిట్ 2 సినిమా ని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించడం.. దానికి సంబందించిన హిట్ 2 స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైపోయింది.అయితే హిట్ 2  లో విశ్వక్ సేన్ నటించాడేమో విశ్వక్ చాలా డిమాండ్ చేసాడని, కాదు వేరే సినిమాల్తో విశ్వక్ సేన్ బిజీ కాబట్టి హిట్ 2 చెయ్యడెమో అంటూ ప్రచారం జరగడం, మధ్యలో విశ్వక్ వలన హిట్ 2 లేట్ అవ్వోచ్చేమో అనుకున్నారు. కానీ. అయితే విశ్వక్ సేన్ హిట్ 2 చేస్తున్నాడని.. హిట్ కి సంబందించిన పనులు మొదలైనట్టుగా టాక్.

దీనికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావొచ్చింది. అయితే హిట్ 2 లో విశ్వక్ సేన్ తో పాటుగా మరో హీరో కూడా నటించబోతున్నాడని.. అయితే ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌ అంటున్నారు. నానికి అత్యంత స‌న్నిహితంగా ఉండే ఓ యంగ్ హీరో ఈసినిమాలో న‌టిస్తాడ‌ని అంటుంటే.. అడవి శేష్ రెండో హీరోగా ఈ సినెమా లో నటిస్తాడని ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది.కానీ నాని అండ్ కో మాత్రం సెకండ్ హీరో ఎవరనేది చెప్పము.. సినిమా షూటింగ్ పూర్తయ్యేవరకు సెకండ్ హీరోపై సస్పెన్స్ మైంటైన్ చేస్తామని అంటున్నారట.

Tags:    

Similar News