Manchu Vishnu: నటుడు మంచు విష్ణు పై ట్రోల్స్.. యూట్యూబర్‌పై కేసు నమోదు
నిందితుడు యూట్యూబ్, సోషల్ మీడియాలో తప్పుడు కంటెంట్ ద్వారా
King Chandrahas అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న విజయ్ చంద్రహాస్ అనే యూట్యూబర్‌పై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. నటుడు విష్ణు మంచు, అతని నిర్మాణ సంస్థను లక్ష్యంగా చేసుకుని, ట్రోల్ చేసి, పరువు తీశారంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ యూనిట్ లో కేసు నమోదు అయింది. మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థను లక్ష్యంగా చేసుకుని కొందరు సామాజిక వేదికల్లో పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘మా’ కోశాధికారి శివబాలాజీ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయ్ చంద్రహాస్ దేవరకొండ అనే యూట్యూబర్ ను గుర్తించిన పోలీసులు అతడికి నోటీసులిచ్చారు. తన చానల్‌ను పాప్యులర్ చేసేందుకే తప్పుడు, కల్పిత వీడియోలు చేస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. శివ బాలాజీ దాఖలు చేసిన ఫిర్యాదుపై IT చట్టంలోని 66 C మరియు D మరియు 351(2) BNS సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.
సోషల్ మీడియా ట్రోలింగ్, సైబర్ బెదిరింపులు తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తాయని సైబర్ క్రైమ్ యూనిట్ పౌరులను హెచ్చరించింది. అటువంటి వేధింపుల గురించి సైబర్ క్రైమ్ యూనిట్‌ను వాట్సాప్ ద్వారా 8712665171 ద్వారా లేదా 100కి కాల్ చేయడం ద్వారా రిపోర్ట్ చేయాలని సూచించారు.