అనసూయని ఉడికిస్తున్న కమెడియన్ ?

జబర్దస్త్ లో హైపర్ ఆది పంచ్ లకు ఫిదా అవ్వని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు. పంచ్ ల మీద పంచ్ లతో ప్రేక్షకులను ఉబ్బి తబ్బిబ్బు చేస్తుంటాడు. [more]

Update: 2020-02-08 05:32 GMT

జబర్దస్త్ లో హైపర్ ఆది పంచ్ లకు ఫిదా అవ్వని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు. పంచ్ ల మీద పంచ్ లతో ప్రేక్షకులను ఉబ్బి తబ్బిబ్బు చేస్తుంటాడు. అలాంటి ఆది.. వారానికో అమ్మాయి అదేనండీ ఓ హాట్ యాంకర్ తో జబర్దస్త్ స్టేజ్ మీద రొమాన్స్ చేస్తూ అందరిని మాయ చేస్తాడు. తన టీం తో కలిసి హైపర్ ఆది చేసే రచ్చ కి జడ్జెస్ కూడా పడి పడి నవ్వాల్సిందే. అయితే హైపర్ ఆది ఎక్కువగా అనసూయ ని తనతో పాటు స్టేజ్ మీద డాన్స్ చెయ్యడానికి తీసుకురావడమే కాదు… ఆమెతో స్కిట్స్ కూడా చేయించేసాడు.

హైపర్ ఆది వారానికో హాట్ యాంకర్ తో అనసూయని ఉడికిస్తున్నాడు. గత వారమైతే.. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో లాంచ్ లతో బాగా బిజీగా ఉంటున్న యాంకర్ మంజూష ని స్టేజ్ మీద కి తీసుకొచ్చాడు. అనసూయ ముందు వయ్యారాలు పోతూ… మంజూష తో అది రొమాంటిక్ స్కిట్ చేసి హిట్ కొట్టాడు. ఇక తాజాగా జబర్దస్త్ ప్రోమో లో ఈసారి ఆది ఎవరిని తీసుకొచ్చాడో తెలుసా.. మాజీ హీరోయిన్ మాధవి లతని. ఇక ఆది మాధవి లతతో రొమాన్స్ చేస్తుంటే.. హాట్ యాంకర్ అనసూయ మాత్రం అలా చూస్తుండిపోయింది. ఈలోపు జడ్జ్ స్థానంలో ఉన్న రోజా ఎప్పటిలాగే ఇక్కడేదో కాలుతున్న వాసన వస్తుంది అంటూ. అనసూయ – ఆదికి కలిపి పంచ్ వెయ్యడం మాత్రం అదుర్స్.

Tags:    

Similar News