బ్రాహ్మిణి అంటే నాకు భయం – బాలయ్య!!

బాలకృష్ణ ఈ ఏడాది షష్టిపూర్తి చేసుకుంటున్నాడు. ఈ రోజు పుట్టిన రోజుతో బాలయ్యకి 60 ఏళ్ళు వస్తున్నాయి. దానితో బాలకృష్ణ భార్య వసుందర తో కలిసి షష్టిపూర్తి [more]

Update: 2020-06-10 04:37 GMT

బాలకృష్ణ ఈ ఏడాది షష్టిపూర్తి చేసుకుంటున్నాడు. ఈ రోజు పుట్టిన రోజుతో బాలయ్యకి 60 ఏళ్ళు వస్తున్నాయి. దానితో బాలకృష్ణ భార్య వసుందర తో కలిసి షష్టిపూర్తి సిద్దమయ్యాడు. రెండు రోజులనుండి బాలకృష్ణ ఇంటి దగ్గర హోమాలు పూజలు అంటూ హడావిడి చెయ్యడమే కాదు… పుట్టిన రోజునాడు తనని కలవడానికి ఎవరూ రావొద్దని.. కరోనా కారణముగా సామజిక దూరం పాటిస్తూ తన పుట్టిన రోజు వేడుకలను ఇంట్లోనే చేసుకొమ్మని.. ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసాడు. అయితే తాను మాత్రం ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ పుట్టిన రోజుకి ముందు మూడు రోజులనుండి హల్చల్ చేస్తున్నాడు. పొలిటికల్, కెరీర్ గురించి ఆ ఇంటర్వూస్ లో మాట్లాడుతున్న బాలయ్య బాబు పర్సనల్ విషయాలను ముచ్చటిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ నుండి తనకి క్రమ శిక్షణ అలవాటైంది అని.. నేనంటే చాలామంది భయపడతారు.. కానీ భమెందుకు, అందరితో ప్రేమతో ఉంటాను అంటున్నాడు బాలయ్య.

అయితే బాలకృష్ణ కి తన నాన్న ఎన్టీఆర్ అంటే భయమట. ఓసారి వీరబ్రహ్మేంద్ర స్వామి షూటింగ్ చేస్తున్నప్పుడు టేకుల మీద టేకులు తీసుకుంటుంటే.. అక్కడే ఉన్న నాన్న గారు అందరి ముందు తిట్టేసారు. దానితో అప్పటినుండి ప్రతి సీన్ లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాను అంటున్నాడు. ఇక నాన్నగారు తర్వాత మరొకరికి మీరు భయపడతారటగా అని అడిగితె.. అవును మా అమ్మాయి బ్రాహ్మిణి అంటే నాకు భయం. తాను చాల బ్యాలెన్సుడ్ గా ఉంటుంది. ఏదైనా చాల కూల్ గా చెబుతుంది. తనకి రాజకీయాలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇక తనకి సహనం ఓపిక చాల ఎక్కువ. తన దగ్గరనుండె సహనంతో ఉండడం నేర్చుకున్నాను. అయితే నా కూతురు ఇంట్లో లేనప్పుడు నా మనవడితో కలిసి అల్లరల్లరి చేస్తాను. ఎందుకంటే నా మనవడికి కూడా వాళ్ళ అమ్మ అంటే భయం అంటూ సరదాగా నవ్వేసాడు బాలయ్య.

Tags:    

Similar News