నేను సీరియల్స్ లోన.. కామెడిగా ఉందా?
టాప్ కమెడియన్ అయినా బ్రహ్మానందం ప్రస్తుతం వెండితెర అవకాశాలు లేక ఉసూరుమంటున్నాడు. మరోపక్క కొడుకు గౌతమ్ కూడా హీరోగా రాణించలేకపోతున్నాడు. అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ [more]
టాప్ కమెడియన్ అయినా బ్రహ్మానందం ప్రస్తుతం వెండితెర అవకాశాలు లేక ఉసూరుమంటున్నాడు. మరోపక్క కొడుకు గౌతమ్ కూడా హీరోగా రాణించలేకపోతున్నాడు. అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ [more]
టాప్ కమెడియన్ అయినా బ్రహ్మానందం ప్రస్తుతం వెండితెర అవకాశాలు లేక ఉసూరుమంటున్నాడు. మరోపక్క కొడుకు గౌతమ్ కూడా హీరోగా రాణించలేకపోతున్నాడు. అయితే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ తో ఓ మూడు నెలల నుండి ఇంటికే పరిమితమైన బ్రహ్మి.. కమెడియన్ అవకాశాలు లేక.. బుల్లితేర వైపు చూస్తున్నాడు.. త్వరలోనే బ్రహ్మానందం మెయిన్ లీడ్ లో ఓ సీరియల్ లో నటించబోతున్నాడు.. ఆ సీరియల్ కూడా కామెడీ టైప్ లోనే ఉండబోతుంది అంటూ గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతోంది. వెండితెర ఆహ్వానించకపోతే నేమి.. బుల్లితెర ఉందిగా అంటూ బ్రహ్మి అనుకుని.. ఓ కొత్త సీరియల్ కథ నచ్చి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ అబ్బో ఇలా హాస్య బ్రహ్మ బ్రహ్మానందంపై బోలెడన్ని న్యూస్ లు హల్చల్ చేస్తున్నాయి.
అయితే తాజాగా బ్రహ్మానందం తానూ సీరియల్స్ లో నటిస్తున్నాడనే వార్తలపై షాకయ్యాడు. అవన్నీ ఒట్టి గాలి వార్తలే అని.. తాను సీరియల్స్ లో నటిస్తున్న అని వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్నాడు. కరోనా లాక్ డౌన్ తో గత మూడున్నర నెలలుగా ఇంట్లోనే గడుపుతున్నా…. అని.. ఈ పరిస్థితుల్లో ఇంకా కొన్ని రోజులపాటు తాను ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని డిసైడ్ అయినట్లు చెబుతున్నాడు. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో బుక్స్ చదువుతూ కాలక్షేపం చేశా అని.. ఆఖరుకి ఖురాన్ కూడా అధ్యయనం చేసి మహ్మద్ ప్రవక్త చెప్పిన సూక్తులు చదివా అని చెబుతున్నాడు బ్రహ్మి. ఇక గౌతమ్ కొడుకు తో తాను ఆడుకుంటూ ఉంటె అసలు సమయమే తెలియడం లేదని చెబుతున్నాడు.