అక్కినేని జంటని చూసి నేర్చుకుంటున్నాడట!!

అక్కినేని హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ మొదట్లో వరస సినిమాలు చేసి తర్వాత భారీ గ్యాప్ తీసుకుని చి ల సౌ తో హిట్ కొట్టాడు. [more]

Update: 2020-07-02 06:49 GMT

అక్కినేని హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ మొదట్లో వరస సినిమాలు చేసి తర్వాత భారీ గ్యాప్ తీసుకుని చి ల సౌ తో హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఆలా వైకుంఠపురములో సినిమా చేసిన సుశాంత్ ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. అయితే అన్ని సినిమాల వలే ఈ సినిమా కూడా కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడింది. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన సుశాంత్ చాల విషయాలను అభిమానులల్తో పంచుకున్నాడు. తనకి కథ బాగా నచ్చితే విలన్ రోల్స్ చేయడమైనా ఇష్టమే అని చెప్పి షాకిచ్చాడు. కథ లో బలం ఉంటె.. విలన్ రోల్స్ అయినా ఒకే అంటున్నాడు ఈ అక్కినేని హీరో.

లాక్ డౌన్ తో ఇంట్లోనే గడుపుతున్న సుశాంత్ సినిమా షూటింగ్స్ ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని ఎదురు చూస్తున్నాడట. ఇక తన బావ నాగ చైతన్య – సమంత లు చాల క్రమ శిక్షణతో ఉంటారట. అలాగే తాను వాళ్ళలా ఉండడానికి ట్రై చేస్తున్న అంటున్నాడు. మరి చైతు – సమంత లు సపరేట్ గా ఇల్లు తీసుకుని ఉంటున్నారు. అక్కినేని ఫ్యామిలీతో కలిసి లేకపోయినా.. వారానికి ఒకసారి అందరూ కలిసి భోజనం చేస్తుంటామని ఒకొనొక సందర్భంలో నాగార్జున చెప్పాడు. మరి చైతు – సామ్ ల నుండి అక్కినేని హీరో సుశాంత్ క్రమ శిక్షణ నేర్చుకుంటున్నాడన్నమాట.,

Tags:    

Similar News