ఇంట్లో ఉంటే.. రకరకాల హెయిర్ స్టయిల్స్ ట్రై చేస్తుంటా..!

కొంతమంది తారలు షూటింగ్ అవ్వగానే పార్టీలు పబ్బులు, ఫ్రెండ్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం షూటింగ్ అవ్వగానే ఇంటికి వెళ్లిపోతుందట. అ.. ఆ [more]

Update: 2020-09-29 16:47 GMT

కొంతమంది తారలు షూటింగ్ అవ్వగానే పార్టీలు పబ్బులు, ఫ్రెండ్స్ అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం షూటింగ్ అవ్వగానే ఇంటికి వెళ్లిపోతుందట. అ.. ఆ సినిమా అప్పటినుండి అందరిని ట్రెడిషనల్ గా ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ కెరీర్ టర్న్ అయ్యే పాత్ర ఇంతవరకు పడలేదు. కానీ అనుపమ క్యూట్ లుక్స్, ఆమె అందం, అణుకువ అన్ని ట్రెడిషనల్ గర్ల్ ని తలపిస్తాయి. అయితే తాజాగా షూటింగ్ లేనప్పుడు ఇంట్లో గడిపే మీరు ఏం చేస్తుంటారు. అందానికి అవసరమైన పనులు ఏం చేస్తారు అని అడగగానే.. నేను షూటింగ్ లొకేషన్ లో అల్లరి పిల్లలా కనిపించినా ఇంట్లో మాత్రం సైలెంట్ గానే ఉంటానంటుంది.

షూటింగ్ అవ్వగానే ఇల్లే నాలోకంగా మరిపోతుంది. మేకప్ లేకుండా ఇంట్లో నేచురల్ గా ఉండడానికే ఇష్టపడతాను. కానీ రకరకాల హెయిర్ స్టయిల్స్ ని మాత్రం ట్రై చేస్తుంటాను అని చెబుతుంది అనుపమ పరమేశ్వరన్. ఇక అందం పై ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోను. అందం అంటే పై పై మెరుగులు కాదంటుంది. అందం అంటే మనసు ప్రశాంతంగా ఉండడమే అంటుంది. ఇక నేను నేనులా ఉంటేనే నాకు ఆనందం అంటుంది అనుపమ పరమేశ్వరన్. మరి ప్రస్తుతం తెలుగులో ఓ అనుకున్న అవకాశాలు లేని అనుపమ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటుంది.

Tags:    

Similar News