పాపం ఇల్లి బేబీ కి అన్ని కష్టాలా?
బుల్లి నడుము ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ ని ఓ ఊపు ఊపిన తార. స్టార్ హీరోస్ అయిన ప్రభాస్, పవన్ కళ్యాణ్, తారక్, అల్లు అర్జున్ లాంటి [more]
బుల్లి నడుము ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ ని ఓ ఊపు ఊపిన తార. స్టార్ హీరోస్ అయిన ప్రభాస్, పవన్ కళ్యాణ్, తారక్, అల్లు అర్జున్ లాంటి [more]
బుల్లి నడుము ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ ని ఓ ఊపు ఊపిన తార. స్టార్ హీరోస్ అయిన ప్రభాస్, పవన్ కళ్యాణ్, తారక్, అల్లు అర్జున్ లాంటి హీరోలందరితో నటించిన ఇలియానా కి బాలీవుడ్ మీద మోజు పుట్టింది. అలాగని అక్కడైనా ఇలియానా కుదురుకుందా? లేదే.. బాయ్ ఫ్రెండ్ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగి చివరికి అతనికి బ్రేకప్ చెప్పి డిప్రెషన్ లోకి వెళ్లి.. స్లిమ్ బ్యూటీ కాస్తా.. బబ్లీ బ్యూటీ అయ్యింది. దానితో ఇలియానా అంటే అభిమానం ఉన్న వారే విమర్శించడం మొదలు పెట్టారు. బరువు పెరిగిన ఇలియానాకి సినిమా అవకాశాలు దూరమయ్యాయి. మళ్ళీ పట్టుదలతో బరువు తగ్గి స్లిమ్ బ్యూటీలా మారినా ఇలియానా ఫేస్ లో కళ కోల్పోయింది.
జిమ్ వర్కౌట్స్ చేస్తున్న ఇలియానా బరువు తగ్గి స్లిమ్ గా అయిన ఫొటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే రీసెంట్ గా తనపై బాడీ షేమింగ్ దారుణంగా ఉండేదంటూ ఓ ఇంటర్వ్యూ లో షాకింగ్ గా మాట్లాడింది. తనని ఒకప్పుడు చాలామంది వెక్కించారని, ఈ అమ్మాయి హీరోయిన్ ఏమిటి? అసలు ఇలా ఉంటే నువ్వు హీరోయిన్ ఎలా అవుతావ్? అంతేకాకుండా హీరోయిన్ కావాలంటే వక్షోజాలు పెద్దగా ఉండాలని, కానీ నీకు లేవని చాలా హేళనగా మాట్లాడేవారంటూ గుర్తు చేసుకుంది. అయితే ఇలియాననే తన బాడీ లో తనకి నచ్చని పార్ట్శ్ కూడా ఉన్నాయంటూ చెప్పి షాకిచ్చింది. తన ఎదభాగంతో పాటు తన చేతులు కూడా సన్నగా ఉంటాయని అలాగే ముక్కు పెదాలు కూడా సరిగా ఉండవని, ఇక తాను చూడడానికి పొడవుగా కనిపించనని.. పైగా నల్లగా కూడా ఉంటానని తనకి నచ్చని విషయాలను చాలా ఓపెన్ గా చెబుతుంది ఇలియానా.