ఫిట్నెస్ ఛాలెంజ్ అంటున్న ఇల్లీ బేబీ!!

సౌత్ ని ఓ ఊపు ఊపి బాలీవుడ్ కి చెక్కేసిన ఇల్లి బేబీ  తర్వాత సౌత్ ని చాలా చిన్న చూపు చూసింది. బాలీవుడ్ లో వచ్చిన [more]

Update: 2020-08-12 05:26 GMT

సౌత్ ని ఓ ఊపు ఊపి బాలీవుడ్ కి చెక్కేసిన ఇల్లి బేబీ  తర్వాత సౌత్ ని చాలా చిన్న చూపు చూసింది. బాలీవుడ్ లో వచ్చిన చిన్న చితక అవకాశాలకే ఎగిరెగిరి పడిన ఇలియానా తర్వాత ఆస్ట్రేలియా ఫోటో గ్రాఫేర్ ఆండ్రు తో ప్రేమాయణం నడిపి కొన్నాళ్ళు సహజీవనం కూడా చేసింది. అలా ఆండ్రు తో చెట్టాపట్టాలేసుకుని కెరీర్ ని లెక్క చెయ్యని ఇలియానా తరవాత ఆండ్రు తో బ్రేకప్ చేసుకుని మానసిక సంఘర్షణకి లోనైంది. మానసికంగా కుంగిపోయిన ఇలియానా ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టలేక బాగా బరువు పెరిగింది. ఒకప్పుడు సన్నజాజి నడుముతో ఉర్రుతలూగించిన ఇలియానా గుర్తుపట్టలేకుండా తయారైంది.

అయితే తాజాగా ఇలియానా ఫిట్ నెస్ పై పూర్తి దృష్టి పెట్టడమే కాదు… బాడీ షేప్ కోసం కష్టపడుతోంది. అందులో భాగంగానే ఇలియానా ఎనభై రోజుల ఫిట్ నెస్ ఛాలెంజ్ ను తీసుకున్నానని అంటోంది. అయితే ఇలా వరసగా వర్కౌట్స్ చేయడం మొదట్లో చాలా కష్టమనిపించినా… మెల్లగా వర్కౌట్స్ కి అలవాటుపడ్డానని…  ఇప్పుడు వ్యాయామం చేయనిదే వుండలేకపోతున్నానని.. చివరికి ఫిట్నెస్ అనేది ఓ వ్యసనంలా తయారైందనీ చెబుతోంది. మరి బరువు పెరిగిన ఇలియానా కి పెద్దగా అవకాశాలు రావడం లేదు.. మల్లి సన్నజాజిలా మారితే అయినా ఇలియానాకి మంచి రోజులొస్తాయేమో చూడాలి. 

Tags:    

Similar News