ఒక్కప్పుడు అందం గురించి భయం వేసేది?

పిట్ట నడుముతో వయ్యారాలు పోయే గోవా సుందరి ఇలియానా ఒకొనొక టైం లో సౌత్ ని ఏలింది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి [more]

Update: 2020-10-04 05:06 GMT

పిట్ట నడుముతో వయ్యారాలు పోయే గోవా సుందరి ఇలియానా ఒకొనొక టైం లో సౌత్ ని ఏలింది. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ మూవీస్ లో నటించిన ఇలియానా ప్రస్తుతం సౌత్ ఆఫర్స్ కోసం ఎదురు చూస్తుంది. సౌత్ నుండి బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ టాప్ లెవల్ లో క్రేజ్ సంపాదిద్దామనుకుని బొక్కబోర్లా పడింది. ఇలియానా మధ్యలో బాయ్ ఫ్రెండ్ తో సరసాలాడింది. బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొట్టిన ఇల్లి బేబీ అతనితో బ్రేకప్ అయ్యాక కానీ కెరీర్ విలువ తెలిసిరాలేదు. అయితే ప్రస్తుతం బొద్దు గా ముద్దగా తయారైన ఇలియానాకి ఒకప్పుడు అందం గురించి తెగ భయపడేదట. కొన్నాళ్ల క్రితం వరకు తన అందం గురించి ఇలియానా తెగ బెంగ పెట్టేసుకునేదట.

నేను అందంగా ఉన్నానా.. నా నడుము సన్నగా ఉందని, నా భుజాలు పీలగా ఉన్నాయని, ముక్కు, పెదాలు బాలేదని, హైట్ లేనని, తెలివైనదానిని కాదేమో అని భయపడుతుండేదానిని. నేను చూడడానికి అందంగా ఉన్నానా.. లేదా.. అనే విషయంలో ఎప్పుడు ఆందోళన చెందుతుండేదాన్ని అని చెబుతుంది ఇలియానా. కానీ ఇప్పుడు నాలోని మచ్చలు, లోపాలు, భయాలను వీడి నన్ను నేను మలచుకునే ప్రయత్నం చెయ్యడమే కాదు.. నా అందాన్ని నేను స్వీకరించడం మొదలు పెట్టాను అని చెబుతుంది ఇలియానా. ప్రపంచం అందం వెంట పరుగులుపెడుతుంది. ప్రపంచం అందం అనుకునే దాని గురించి నేనేందుకు ఆగిపోవాలి. వాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటే నేనెందుకు అలా ఉండాలి. వాళ్ళు అనుకున్నట్లుగా నేనెందుకు తయారవ్వాలి. నాకు నేనుగా ఉండాలని అనుకుంటున్నా అంటుంది ఇలీయానా.

Tags:    

Similar News