త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఎప్పటి నుండో ఒక సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. 'నా పేరు సూర్య' తరువాత బన్నీ చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో సినిమా చేయాలని భావించి ఇప్పటివరకు వెయిట్ చేశాడు. అటు త్రివిక్రమ్ కూడా వెంకీతో సినిమా అనుకున్నాడు కానీ చివరికి బన్నీతో చేయాలని డిసైడ్ అయ్యాడు. 'అరవింద సమేత' తరువాత నుండి త్రివిక్రమ్ బన్నీ సినిమా స్క్రిప్ట్ మీదే కూర్చున్నాడు కానీ ఇంతవరకు రెడీ కాలేదు.
త్వరలోనే ప్రారంభం...
దీంతో ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలు నవంబర్ లేదా డిసెంబర్ లో జరపాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ ఇంకా రెడీ కాకపోవడంతో వాయిదాలు పడుతూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ఆల్రెడీ స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేశాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.
స్వంత బ్యానర్ లోనే...
వచ్చే ఏడాది జనవరి లో పూజ కార్యక్రమాలు జరిపి ఫ్రిబ్రవరి నుండి సెట్స్ మీదకు తీసుకుని వెళ్లాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడని మెగా వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తో కలిసి అల్లు అరవింద్ నిర్మించబోతున్నాడు. మిగిలిన డీటెయిల్స్ త్వరలోనే తెలియనున్నాయి. అల్లు అర్జున్ కొత్తగా తన సొంత బ్యానర్ ను లాంచ్ చేయనున్నాడు అది ఈ సినిమాతోనే లాంచ్ చేస్తాడని తెలుస్తుంది.