ప్రముఖ సింగర్ కన్నుమూత

ఆమె 1990 దశాబ్దం ప్రారంభంలో ప్రిన్స్ రాసిన పాటతో గ్లోబల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ను సృష్టించింది

Update: 2023-07-27 02:15 GMT

మరో ప్రముఖ సింగర్ కన్నుమూశారు. 1990 నాటి "నథింగ్ కంపేర్స్ 2 యు" పాటతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫాన్స్ ను సొంతం చేసుకున్న ఐరిష్ సింగర్ సినాడ్ ఓ'కానర్ 56 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు ఐరిష్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ RTE తెలిపింది. ఆమె మరణాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. "మా ప్రియమైన సినాడ్ మరణించినట్లు చెప్పడం చాలా బాధగా ఉంది. ఆమె కుటుంబం, స్నేహితులు చాలా క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. గోప్యతను కోరుకుంటూ ఉన్నారు" అని సినాడ్ కుటుంబం నుండి ఒక ప్రకటన వచ్చింది.ఓ'కానర్ 1990ల ప్రారంభంలో సంగీతంలో మహిళల ఇమేజ్‌ని మార్చింది.

ఆమె 1990 దశాబ్దం ప్రారంభంలో ప్రిన్స్ రాసిన పాటతో గ్లోబల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ను సృష్టించింది. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఆమె పాటలను బాగా వింటున్నారు. దాదాపు 400 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. nothing compares to you sinead o'connor అంటూ సెర్చ్ చేస్తే మీరు కూడా ఆ పాటను వినొచ్చు. ఆమె తన అభిప్రాయాలను చెప్పడానికి ఏ మాత్రం భయపడలేదు. మతం, సెక్స్, స్త్రీవాదం వంటి విషయాలపై ఆమె బహిరంగంగా తన అభిప్రాయాలను తెలిపింది. ఆమె "సాటర్డే నైట్ లైవ్" ప్రోగ్రామ్ లో పోప్ జాన్ పాల్ II ఫోటోను చింపేసి సెన్సేషన్ సృష్టించింది. ఓ'కానర్ 2018లో ఇస్లాం మతాన్ని తీసుకుంది. ఆమె పేరును షుహదా సదాకత్‌గా మార్చుకున్నారు.. అయినప్పటికీ సినెడ్ ఓ'కానర్ పేరుతో ప్రదర్శన కొనసాగించింది.


Tags:    

Similar News