బాబీ సింహనా? నారా రోహిత్..ఆ?
అల్లు అర్జున్ – సుకూంర్ కాంబోలో తెరకెక్కనున్న పుష్ప సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో అర్ధం కావడం లేదు. కారణం సినిమాటోగ్రాఫర్ అనే టాక్ ఉంది. ఒక్కొక్కరు [more]
అల్లు అర్జున్ – సుకూంర్ కాంబోలో తెరకెక్కనున్న పుష్ప సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో అర్ధం కావడం లేదు. కారణం సినిమాటోగ్రాఫర్ అనే టాక్ ఉంది. ఒక్కొక్కరు [more]
అల్లు అర్జున్ – సుకూంర్ కాంబోలో తెరకెక్కనున్న పుష్ప సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో అర్ధం కావడం లేదు. కారణం సినిమాటోగ్రాఫర్ అనే టాక్ ఉంది. ఒక్కొక్కరు మెల్లగా షూటింగ్స్ మొదలుపెడుతున్నారు. కానీ సుక్కు కి బన్నీకి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. అసలే పాన్ ఇండియా మూవీ, ఆరు నెలల షూటింగ్ లేట్. అయినా ఇప్పుడుకూడా పుష్ప షూటింగ్ మొదలెట్టలేని పరిస్థితి. అదలా ఉంటె ఈ సినిమాలో బన్నీ తో పాటుగా ఓ కీ రోల్ కి అంటే విలన్ రోల్ అనే చెప్పాలి.. ఆ రోల్ కి తమిళ హీరో విజయ్ సేతుపతి తీసుకుంటే పుష్ప టీం కి విజయ్ సేతుపతి హ్యాండ్ ఇచ్చాడు. దానితో సుకుమార్ ఆ కేరెక్టర్ కోసం మరో హీరో వేటలో పడ్డాడు.
చివరికి విజయ్ సేతులపతి కేరెక్టర్ కోసం టాలీవుడ్ నుండే ఓ యంగ్ హీరోని తీసుకోవాలని చూస్తున్నాడట. దాని కోసం తెలుగు నుండి నారా రోహిత్ పేరు వినిపిస్తుండగా… తమిళ్ నుండి బాబీ సింహను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నారా రోహిత్ అయితే పాన్ ఇండియా కి సెట్ అవుతాడా? లేదంటే బాబీ సింహ అయితే పాన్ ఇండియా కి సెట్ అవుతాడా? అనే కన్ఫ్యూజన్ లో మూవీ టీం ఉందట. ఫైనల్ గా సుకుమర్ ఓటు నారా రోహిత్ కి పడుతుందా? లేదంటే బాబీ సింహ కి పడుతుందా ? అనేది పుష్ప టీం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.