జబర్దస్త్ కో దండం అంటున్ననాగబాబు?
ఈ టివి లో జబర్దస్త్ షో మొదలైంది మొదలు జడ్జి లుగా నాగబాబు, రోజాలు ఇన్నేళ్ళుగా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మధ్యలో చిన్న చిన్న ప్రోబ్లెంస్ వలన [more]
ఈ టివి లో జబర్దస్త్ షో మొదలైంది మొదలు జడ్జి లుగా నాగబాబు, రోజాలు ఇన్నేళ్ళుగా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మధ్యలో చిన్న చిన్న ప్రోబ్లెంస్ వలన [more]
ఈ టివి లో జబర్దస్త్ షో మొదలైంది మొదలు జడ్జి లుగా నాగబాబు, రోజాలు ఇన్నేళ్ళుగా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. మధ్యలో చిన్న చిన్న ప్రోబ్లెంస్ వలన నాగబాబు, రోజా లు ఒక్కొక్కసారి షో కి హాజరవకపోయినా… వేరే సెలెబ్రిటీ జేడ్జ్ లతో షో ని కానిచ్చేశారు మల్లెమాల వారు. అయితే నాగబాబు, రోజా మాత్రం ఎన్ని పనులున్నా జబర్దస్త్ షో ని వీడడం లేదు. రోజా అయితే ఎమ్యెల్యేఅయినప్పటికీ షో ని వదలడం లేదు. కానీ తాజాగా నాగబాబు జబర్దస్త్ షో కి బై బై చెప్పబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది.మల్లెమాల వారికి నాగబాబు కి మధ్యన ఏదో ఇష్యు నడుస్తుండడంతో… నాగబాబు జబర్దస్త్ ని వీడాలనుకుంటున్నాడట.
మల్లెమాల ప్రొడ్యూసర్స్ జబర్దస్త్ షో ని నడిపించే కొంతమంది దర్శకులను, కమెడియన్స్ ని పక్కన పెట్టారట. అయితే ఆ దర్శకులు, కమెడియన్స్ నాగబాబు కి బాగా కావాల్సిన వాళ్ళు కావడం, నాగబాబు చెప్పిన మల్లెమాల వాళ్ళు వినకపోవడంతో.. నాగబాబు ఈ షో నుండి తప్పుకోవాలని డిసైడ్ అయ్యాడట. అయితే నాగబాబు తో జబర్దస్త్ కి మంచి క్రేజ్ ఉందని గ్రహించిన మల్లెమాల యాజమాన్యం నాగబాబు ని బుజ్జగించినా ఆయన మాత్రం వంగలేదట. అయితే తప్పించిన వాళ్ళని మళ్ళీ తీసుకుంటానంటే జబర్దస్త్ జేడ్జ్ గా ఉంటానని చెప్పడంతో.. మల్లెమాల యాజమాన్యం ఆలోచనలో పడిందట. అయితే ఇక ముందు రాబోయే ఎపిసోడ్స్ లో నాగబాబు రాడని తెలుస్తుంది