ఈ హిట్ డైరెక్టర్ చీప్ స్టార్ అన్నది ఎవరిని?

RX 100 సినిమాతో హిట్ కొట్టిన అజయ్ భూపతికి ఇప్పటి వరకు రెండో సినిమా చేసే ఛాన్స్ దక్కలేదు. RX 100 తర్వాత అజయ్ భూపతి, నితిన్ [more]

;

Update: 2019-09-04 06:23 GMT
RX 100 Payal Rajpoot Telugu news
  • whatsapp icon

RX 100 సినిమాతో హిట్ కొట్టిన అజయ్ భూపతికి ఇప్పటి వరకు రెండో సినిమా చేసే ఛాన్స్ దక్కలేదు. RX 100 తర్వాత అజయ్ భూపతి, నితిన్ తో సినిమా చేస్తాడనే ప్రచారం జరగడమే కాదు.. ఈ దర్శకుడు పారితోషకం ఎక్కువ డిమాండ్ చెయ్యడం వలనే అతని రెండో సినిమా పట్టాలెక్కలేదనే ప్రచారము జరిగింది. ఇక మహాసముద్రం అనే పవర్ ఫుల్ స్క్రిప్ట్ పట్టుకుని అక్కినేని కాంపౌండ్ లోకి వెళ్లి చైతు తో సినిమా చేస్తున్నారు అని అన్నారు. కానీ రవితేజ తో మహాసముద్రం సినిమాని అజయ్ పట్టాలెక్కించేస్తున్నాడని అన్నారు.

అనడమే కాదు…. రవితేజ డిస్కో రాజా తర్వాత అజయ్ భూపతి తో మహాసముద్రం సినిమా చేస్తాడని.. ఆ సినిమా కోసం ఇప్పటికే హీరో సిద్దార్ధ్ ని కూడా సెట్ చేసుకున్నారనే టాక్ నడిచింది. అయితే తాజాగా అజయ్ భూపతి కి రవితేజ షాకిచ్చాడని.. ఈ సినిమా కోసం భారీ పారితోషకం రవితేజ డిమాండ్ చెయ్యడమే కాదు.. అజయ్ ని కథలో మార్పులు చేర్పులు చెయ్యమన్నాడని.. నిర్మాతలకు, అజయ్ కి రవితేజ చుక్కలు చూపించాడని అంటున్నారు. అందుకే అజయ్ భూపతి కి బాగా మండి పేరుని మెన్షన్ చెయ్యకుండా తన ట్విట్టర్ లో చీప్ స్టార్ అంటూ రవితేజని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసాడనే టాక్ నడుస్తుంది. మరి అజయ్ ఇలా చీప్ స్టార్ అంటూ రవితేజపై కామెంట్ చెయ్యడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

Tags:    

Similar News