samantha face surgery : సమంతను చూసి షాకైన ఫ్యాన్స్.. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా?

సమంత ఫొటో చూసిన నెటిజన్లు, అభిమానులు షాకవుతున్నారు. ఏమాయ చేశావె అంటూ.. కుర్రకారు మనసుల్ని దోచుకున్న..;

Update: 2022-10-26 11:53 GMT
samantha face surgery, yashoda movie, shakuntalam

samantha ruth prabhu

  • whatsapp icon

చైతూతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత పేరు ఏదోరకంగా నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఆమె సినిమాలు, పర్సనల్ లైఫ్, విడాకులు ఇలా రకరకాల అంశాల గురించి సమంతపై చర్చించుకుంటున్న నెటిజన్లు, అభిమానులు. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకునే సమంత.. కొద్దిరోజులుగా సైలెంట్ అయింది. దానిపై కూడా రూమర్స్ రాగా.. ఆమె సినిమాల షూటింగులలో బిజీ గా ఉండటం వల్లే సోషల్ మీడియాకు రావట్లేదని ఆమె మేనేజర్ వెల్లడించారు.

తాజాగా.. సమంత ఫొటో చూసిన నెటిజన్లు, అభిమానులు షాకవుతున్నారు. ఏమాయ చేశావె అంటూ.. కుర్రకారు మనసుల్ని దోచుకున్న సమంత ముఖం ఇప్పుడు గుర్తుపట్టలేనట్టుగా మారిపోయింది. తాజాగా చేసిన ఓ యాడ్ లో సమంతను గమనిస్తే.. ముఖంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. సమంత ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ జరిగిందంటూ నెట్టింట ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అసలు ఆ ఫొటోలో ఉన్న సమంతేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అందులో నిజమెంతన్న విషయం ఆమెకే తెలియాలి. త్వరలోనే సమంత నటించిన యశోద ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం సమంత తప్పనిసరిగా మీడియా ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడైనా ఈ రూమర్లపై క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.








Tags:    

Similar News