వర్మ "నిజం" ఛానల్ అందుకేనట
వివేకా హత్యలో నిజం లో , అబద్దముందా ? అనే ఎపిసోడ్ తో “నిజం” ఛానల్ ప్రారంభమవుతుందని దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు
వివేకా హత్యలో నిజం లో , అబద్దముందా ? అనే ఎపిసోడ్ తో నా “నిజం” ఛానల్ ప్రారంభమవుతుందని దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు తాను ప్రారంభించబోయే నిజం ఛానల్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అబద్ధాల బట్టలూడదీయడానికి.. ఆ బట్టలూడదీసి విసిరి పారెస్తేనే , నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుందని రాంగోపాల్ వర్మ అన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో...
అబద్ధం బతికేదే నిజాన్ని చంపటం కోసం ప్రయత్నించటానికి .. నిజాన్ని ఎవ్వరూ చంపలేరని,కానీ నిజం అప్పుడప్పుడూ చచ్చిపోయినట్టు నటిస్తుందని, దానికి మోసపోయి, చచ్చింది అని అబద్ధాలు చెప్పే వాళ్ళు సంబరం తో డాన్స్ లాడు తూండగా ఏదో ఒక రోజు వెనక నుంచి ముందు పోటు పొడుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. నిజాన్ని చేధించడానికి ఒకే ఒక్క సాధనం లాజికల్ థింకింగ్ .. అనాలిసిస్ ద్వారా , టెక్నాలజీ ద్వారా , సర్కమ్ స్టన్సేస్ ద్వారా అన్నింటికన్నా ముఖ్యంగా మోటివ్ మీద కాన్సంట్రేట్ చేయడం ద్వారా నిజాన్ని అబద్ధం నుంచి కాపాడవచ్చని వర్మ పేర్కొన్నారు.