ఇస్మార్ట్ పోరి.. స్మార్ట్ గా పెంచేసింది
నన్నుదోచుకుందువటే సినిమాలో సుధీర్ బాబు తో కలిసి ట్రెడిషనల్ గా నటించిన రాని పేరు.. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ సరసన హాట్ హాట్ అందాల ఆరబోతకు [more]
నన్నుదోచుకుందువటే సినిమాలో సుధీర్ బాబు తో కలిసి ట్రెడిషనల్ గా నటించిన రాని పేరు.. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ సరసన హాట్ హాట్ అందాల ఆరబోతకు [more]
నన్నుదోచుకుందువటే సినిమాలో సుధీర్ బాబు తో కలిసి ట్రెడిషనల్ గా నటించిన రాని పేరు.. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ సరసన హాట్ హాట్ అందాల ఆరబోతకు మాత్రం తెగ పేరొచ్చోసింది నాభ నటేష్ కి. మరి ఇస్మార్ట్ శంకర్ లో నాభ నటేష్ చేసిన పాత్ర అట్టాటి ఇట్టాటి పాత్ర కాదు. అంత హాట్ గా పిచ్చెక్కించే పాత్ర. రామ్ పోకిరిగా, మాస్ పాత్రలో రెచ్చిపోతే… నాభ నటేష్ కూడా మాస్ గర్ల్ గా తెలంగాణ యాసలో అందాల ఆరబోతలో పిచ్చెక్కించేసింది. మరి ఇస్మార్ట్ శంకర్ టాక్ కి కలెక్షన్స్ కి సంబంధమే లేకుండా రెండో వారంలోను మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. మరి ఫస్ట్ హిట్ తో ఈ ఇస్మార్ట్ పోరి నాభ నటేష్ పిచ్చ హ్యాపీలో ఉంది.
అందుకే తదుపరి సినిమాలకు తన పారితోషకాన్నిపెంచే పనిలో బిజీగా ఉందంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది. ఇస్మార్ట్ శంకర్ కి కేవలం 30 లక్షలందుకున్న ఈ భామ ఇప్పుడు తన వద్దకు వచ్చే నిర్మాతలను మరో పది యాడ్ చేసి 40 లక్షలు డిమాండ్ చేస్తుందట. ఇప్పటికే రవితేజ తో డిస్కో రాజా సినిమాలో నటిస్తున్న నాభ నటేష్ ఆ సినిమా కూడా హిట్ అయితే మరో పది పెంచి టోటల్ గా 50 చేసినా చెయ్యొచ్చంటున్నారు. అంతేగా అవకాశము, అదృష్టము ఉన్నప్పుడే అందలమెక్కాలి. అలాగే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను నాభ ఫాలో అయిపోతుంది. ఇక తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తోనూ నాభ సోషల్ మీడియా కి బాగా దగ్గరగా ఉంటుంది. నాభ పీఆర్ టీం నాభ ని ఎంతలా ప్రమోట్ చెయ్యాలో అంతగా చేస్తున్నారు కూడా.