ఇంకా క్లారిటీ లేదు

ఎన్నో అంచనాలు మధ్య అక్టోబర్ 2 న మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం రిలీజ్ అవుతుందని చాలా రోజులు నుండి వార్తలు వస్తున్నాయి. ఇది అధికారంగా [more]

Update: 2019-07-30 08:11 GMT

ఎన్నో అంచనాలు మధ్య అక్టోబర్ 2 న మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం రిలీజ్ అవుతుందని చాలా రోజులు నుండి వార్తలు వస్తున్నాయి. ఇది అధికారంగా అనౌన్స్ చేయకపోయినా దాదాపు నిజమే అనుకున్నారు అంత. కానీ అక్టోబర్ 2 న రావడానికి రెడీగా లేరు మెగాస్టార్. పోస్ట్ ప్రొడక్షన్స్ వేగంగా జరుగుతున్న విజువల్ ఎఫెక్ట్స్ వల్ల అనుకున్న సమయం కంటే ఆలస్యంగా పనులు జరుగుతున్నాయి కావున చిత్రం లేట్ అయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

సంక్రంతి దాకా…..

అయితే సైరా అక్టోబర్ 2 డేట్ వదులుకుంటే మళ్ళీ సంక్రాంతి దాకా మంచి ఛాన్స్ ఉండదు. కానీ సంక్రాంతికి ఆల్రెడీ అల్లు అర్జున్ – మహేష్ రెడీ గా ఉన్నారు. ఇంత హెవీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా అంత పోటీ మధ్య రిలీజ్ చేసే అవకాశం లేదు. సో విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆపకుండా డే అండ్ నైట్ పని చేస్తే ముందుగా అనుకున్న డేట్ కి రావొచ్చు. అలా కాదు అనుకుంటే మంచి డేట్ దొరికే అవకాశమే లేదు. డిసెంబర్ లో రిలీజ్ చేద్దాం అన్న అప్పుడు చాలా పెద్ద అండ్ మీడియం రేంజ్ సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. అసలు ఇందులో నిజముందో లేదో ఆగస్టు 22 న చిరు బర్త్ డే రోజు తెలిసిపోతుంది.

Tags:    

Similar News