జగన్ పై మంచు పంచ్ రేపు ఎలా ఉండబోతోందో?
మోహన్ బాబు సినిమా టిక్కెట్ల ధరలపై ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు హాట్ టాపిక్ గానే ఉంది. పేదలకు తక్కువ ధరకే వినోదాన్ని అందించడానికే టిక్కెట్ ధర తగ్గించామని ప్రభుత్వం చెబుతోంది. టిక్కెట్లు ధరలు తగ్గిస్తే తమకు గిట్టుబాటు కాదని థియేటర్ యజమానులు చెబుతున్నారు. ధియేటర్లను కూడా మూసివేశారు. సినీ పరిశ్రమ నుంచి కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం కమిటీని నియమించనుంది.
సినీ టిక్కెట్ల ధరలపై ....
రేపు హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది. అయితే మోహన్ బాబు రేపు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. మోహన్ బాబు సినిమా టిక్కెట్ల ధరలపై ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మోహన్ బాబు వైసీపీ లో ఉన్నా ఆయన పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వంపై ఎటువంటి నెగిటెవ్ కామెంట్స్ చేయ లేదు. మెగాస్టార్ చిరంజీవి కూడా టిక్కెట్ల ధరలపై పునస్సమీక్షించాలని కోరారు. మరి మోహన్ బాబు లేఖ వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.