అనసూయ కి మళ్ళీ తిక్క రేగింది

అనసూయ జబర్దస్త్ గా అందాలు ఆరబోయడమే కాదు.. పదునైన మాటలతో తనజోలికి వచ్చిన వాళ్ళ తాట కూడా తీస్తుంది. తనని కానీ ఆడవారిని ఎవ్వరినైనా కామెంట్ చేసిన [more]

Update: 2019-12-08 06:22 GMT

అనసూయ జబర్దస్త్ గా అందాలు ఆరబోయడమే కాదు.. పదునైన మాటలతో తనజోలికి వచ్చిన వాళ్ళ తాట కూడా తీస్తుంది. తనని కానీ ఆడవారిని ఎవ్వరినైనా కామెంట్ చేసిన మగాళ్లని అనసూయ అంత తేలికగా వదిలే రకం కాదు. యాంకర్ గా బుల్లితెర ని దున్నేస్తున్న అనసూయ వెండితెర మీద కూడా వెలిగిపోవడానికి ఎప్పుడూ రెడీనే…అయితే ప్రస్తుతం జబర్దస్త్ విషయంలో అనసూయ సోషల్ మీడియాలో రోజుకో న్యూస్ అంటూ తెగ హైలెట్ అయ్యింది. జబర్దస్త్ కాంట్రవర్సీ, జీ ఛానల్ లో లోకల్ గ్యాంగ్స్ అంటూ అనసూయ హడావిడి అంతా ఇంతా కాదు. లోకల్ గ్యాంగ్స్ ని ఓ లెవెల్ కి తీసుకెళ్లడానికి… కామెడీ ఎంతగా అవసరమో.. జడ్జ్ అనసూయ అందాలు అంతే ముఖ్యమన్నట్టుగా ఆ షో తీరు కనబడుతుంది. జానీ మాస్టర్ తో కలిసి లోకల్ గ్యాంగ్స్ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న అనసూయ ఆ షో కోసం హాటెస్ట్ అండ్ గ్లామర్ కి మారుపేరుగా కనబడుతుంది.

తాజాగా అనసూయ ఈ షో కోసం వేసిన ఓ చీర మాత్రం అదుర్స్ అన్న రేంజ్ లో హైలెట్ అయ్యింది. రెడ్ బ్లౌజ్ లో హాట్ హాట్ అందాలను చూపిస్తూ అనసూయ కట్టిన వైట్ సారి ని చూస్తుంటే.. అబ్బా ఆడవారికి అందం చీరలోనే ఉంటుంది అనేలా ఉంది. సోషల్ మీడియాలో అనసూయ ఆ ఫొటోస్ ని షేర్ చెయ్యగా.. ఓ నెటిజెన్ అనసూయ ని ఉద్దేశించి.. అనసూయ గారు మీకు పెళ్లయింది.. మీకు ఇవన్నీ అవసరమా ?… అంటూ కామెంట్ చేసాడు. దానితో అనసూయ కు మండింది. అందుకే అతనికి ఓ రేంజ్ లో రిప్లయ్ పెట్టింది.. జగదీష్ గారు మీకు బుర్రలేదు మీకు ఇలా నాతో మాట్లాడటం అవసరమా అండి? అంటూ అనసూయ ఘాటుగా స్పందించింది. తాజాగా అనసూయ దిశా కేసు విషయంలోనూ నెటిజెన్స్ కి వీరలెవల్లో క్లాస్ పీకిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News