నాతో ఎవ్వరూ పోటీకి రాలేరు.. అది వాళ్ళ భ్రమ?
ఈటివి జబర్దస్త్ లో హైపర్ అది స్కిట్స్ కి పడి పడి వనవ్వనివారుండరు. ఆది పంచ్ లు పటాస్ ల్లా పేలుతూనే ఉన్తయి. పంచ్ మీద పంచ్ [more]
ఈటివి జబర్దస్త్ లో హైపర్ అది స్కిట్స్ కి పడి పడి వనవ్వనివారుండరు. ఆది పంచ్ లు పటాస్ ల్లా పేలుతూనే ఉన్తయి. పంచ్ మీద పంచ్ [more]
ఈటివి జబర్దస్త్ లో హైపర్ అది స్కిట్స్ కి పడి పడి వనవ్వనివారుండరు. ఆది పంచ్ లు పటాస్ ల్లా పేలుతూనే ఉన్తయి. పంచ్ మీద పంచ్ గుక్కతిప్పుకోకుండా వేస్తూనే ఉంటాడు. షేకింగ్ శేషు మీద, దొరబాబు మీద ఒక్కటేమిటి రోజా అనసూయ ఎవరిమీదైనా ఆది పంచ్ లు వెయ్యగలడు నవ్వించగలడు. అయితే తాజాగా హైపర్ ఆదికి ఎర్త్ పెడుతున్న సద్దాం అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలోకొచ్చింది. జీ ఛానల్ లో నాగబాబు జేడ్జ్ గా అదిరింది కామెడీ షోలో సద్దాం తాజాగా అది మీద చిన్న ఇండైరెక్ట్ పంచ్ వేసాడు. రేటింగ్స్ విషయంలో వేసిన పంచ్ ఆది మీదే అంటూ.. ఆదిని తలదన్నే సద్దాం అంటూ హెడ్డింగ్ లు పెట్టి ప్రచారం చేస్తున్నారు.
కానీ ఆది మాత్రం నాకెవరు పోటీ కాదు.. నాకు పోటీ అనుకుంటే అది వాళ్ళ భ్రమ అంటూ చిన్నమాటతో తీసేసాడు. భ్రమలు వేరు .. నిజాలు వేరు అని గ్రహించాలి. హైపర్ ఆదితో పోల్చుకోవాలన్నా, ఆది ని బీట్ చేయాలన్నా దానికి కొన్ని లెక్కలు వున్నాయి. ఇప్పటివరకు నేను 130 స్కిట్స్ చేశా. అందులో 40 వరకు 10 మిలియన్ వ్యూస్ వచ్చినవి ఉంటే…. 20 మిలియన్ వ్యూస్ వచ్చినవి ఓ ఐదు స్కిట్స్ ఉన్నాయి. అలాగే 30 మిలియన్ వ్యూస్ వచ్చినవి రెండు ఉంటే.. అందులో ఒకదానికి 50 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే… నా రేంజ్ అది..నన్ను దాటి క్రేజ్ తెచ్చుకోవాలంటే. ముందు వీటిని బీట్ చేయమనండి అంటూ భారీ సవాల్ విసురుతున్నాడు హైపర్ ఆది