ఇండస్ట్రీలో విషాదం.. జబర్దస్త్ కమెడియన్ కన్నుమూత
కొన్నాళ్లుగా మూర్తి 'ప్యాంక్రియాస్' క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి నుంచి బయటపడటానికి..
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ మూర్తి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా జబర్దస్త్ కమెడియన్ గా మంచిపేరు సంపాదించుకున్న మూర్తి అనారోగ్యంతో మంగళవారం మధ్యాహ్నం కన్నుమూసినట్లు ఆయన సోదరడు అరుణ్ స్వయంగా వెల్లడించారు. మిమిక్రీ మూర్తి గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ ఒక్కటే కాకుండా ఎన్నో వేదికలపై అనేక ప్రదర్శనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కొన్నాళ్లుగా మూర్తి 'ప్యాంక్రియాస్' క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి నుంచి బయటపడటానికి దాదారు రూ.16 లక్షలు ఖర్చు చేశారు. కానీ.. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించి, మాయదారి వ్యాధి మూర్తి ప్రాణాల్ని హరించింది. ఎంతోమంది నటులను అనుకరించిన మూర్తి.. 2018 వరకు బుల్లితెరపై అయన అలరించారు. క్యాన్సర్ కారణంగా తన కెరియర్ కు దూరమయ్యారు. మూర్తి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ఎంతోమంది దాతలు ఆర్థిక సహాయం అందించిన ఫలితం లేకపోయింది. మిమిక్రీ మూర్తి మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.