అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన 'రుద్రంగి'
జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన రుద్రంగి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది
జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన రుద్రంగి మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డైరెక్ట్‌గా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా జూలై 7న థియేటర్లలో రిలీజైంది. నాలుగు వారాలు కూడా కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో జగపతిబాబుతో పాటు విమలారామన్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలను పోషించారు. రుద్రంగి సినిమాకు తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాతగా వ్యవహరించాడు. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు.
రుద్రంగి సినిమా తెలంగాణ ప్రాంతంలో నిజాం కాలలో భూస్వామ్య వ్వవస్థపై తెరకెక్కించిన సినిమా. స్వాతంత్య్రానికి ముందు జాగీర్దార్, భూస్వాములు చూపించిన కుల వివక్షత చూపించారు. వివిధ పాత్రలతో తిరుగుబాటును కూడా ఈ సినిమాలో చూపించారు. భీమ్ రావ్ దేశ్ ముఖ్ అనే కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించారు. ఆయన పాత్ర మేనరిజాన్ని డిఫరెంట్ గా చూపించారు.