చిత్ర పరిశ్రమలో విషాదం

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు, నటుడు జి మారి ముత్తు

Update: 2023-09-08 06:33 GMT

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు, నటుడు జి మారి ముత్తు శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 57 ఏళ్ల వయసులో ఆయన చనిపోయారని తెలియడంతో తమిళ చిత్ర పరిశ్రమ, కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుకి గురై మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మారి ముత్తు కొన్ని వందల సినిమాలలో నటించారు. మారి ముత్తు రజనీకాంత్ జైలర్ చిత్రంలో నటించారు.

మారి ముత్తుకి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. మారి ముత్తు మణిరత్నం, సీమాన్, యస్ జె సూర్య లాంటి దర్శకులకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. కమల్ హాసన్ విక్రమ్ చిత్రంలో సైతం మారి ముత్తు నటించారు. మారి ముత్తు 1990లో సినిమాల పట్ల ఆసక్తితో ఇంటి నుంచి పారిపోయి చెన్నై వచ్చారు. ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తూ.. నటుడిగా కూడా ఆయన ఎదిగారు. తాజాగా ఆయన మరణంతో తమిళ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 1999లో అజిత్ నటించిన 'వాలి' సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 2008లో 'కన్నుమ్ కన్నుమ్' అనే సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. టెలివిజన్ రంగంలో కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.


Tags:    

Similar News