జెర్సీ రీమేక్ కు ప్రయత్నాలు..!
లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ జెర్సీకి అన్నివైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమాతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఫేట్ మారబోతుంది. ఇదిలా [more]
లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ జెర్సీకి అన్నివైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమాతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఫేట్ మారబోతుంది. ఇదిలా [more]
లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ జెర్సీకి అన్నివైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమాతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఫేట్ మారబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను రీమేక్ చేయడానికి కొంతమంది ప్రముఖులు ముందుకు రావడం విశేషం. అందులో దిల్ రాజు ఒక్కరు. దిల్ రాజు ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. అక్కడ ఈ సినిమా ను మంచి కాస్టింగ్ తో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని టాక్.
బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా…
ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ మూవీపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. తనకు ఈ సినిమాను చూపించాలని జెర్సీ నిర్మాతలను కోరాడట. అలానే తమిళ సినిమా రంగంలో సుప్రసిద్ధ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ కూడా ఈ సినిమాను రీమేక్ చేయడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం. కొంచం ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం నాని రెమ్యూనరేషన్ తీసుకోలేదట. సినిమా హిట్ అయితే అందులో ప్రాఫిట్ ఇవ్వండి చాలు అని అన్నారు అంట.