మధ్యతరగతి ఇల్లాళ్లుగా అదరగొట్టారు..!
ఈ నెలలో విడుదలైన రెండు సినిమాల్లో క్రికెట్ పోలిక ఉంది. మజిలీ సినిమా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. అలాగే నాని జెర్సీ కూడా క్రికెట్ నేపథ్యంలో [more]
ఈ నెలలో విడుదలైన రెండు సినిమాల్లో క్రికెట్ పోలిక ఉంది. మజిలీ సినిమా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. అలాగే నాని జెర్సీ కూడా క్రికెట్ నేపథ్యంలో [more]
ఈ నెలలో విడుదలైన రెండు సినిమాల్లో క్రికెట్ పోలిక ఉంది. మజిలీ సినిమా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. అలాగే నాని జెర్సీ కూడా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ. అయితే ఈ రెండు సినిమాల్లో హీరోయిన్స్ గా నటించిన సమంత, శ్రద్ద శ్రీనాధ్ పాత్రలకు చాలా దగ్గర పోలికలే ఉన్నాయి. మజిలీ సినిమాలో జాబ్ లేని చైతుకి వైఫ్ గా సమంత శ్రావణి అనే మిడిల్ క్లాస్ భార్య పాత్రలో అదరగొట్టే పర్ఫార్మెన్స్ తో ఇరగదీసింది. ఇక జెర్సీ సినిమాలో శ్రద్ద శ్రీనాధ్ కూడా నానికి లవర్ గా, మిడిల్ క్లాస్ భార్యగా ఆకట్టుకుంది. అయితే మజిలీ సినిమాలో భర్త పూర్ణ(చైతు) ఉద్యోగం చెయ్యకపోయినా.. తన తండ్రి(పోసాని), మామ(రావు రమేష్)ల దగ్గర వెనకేసుకొస్తూ భర్త అవసరాలను తీర్చే ఎమోషనల్ క్యారెక్టర్ లో సమంత నటనకు థియేటర్స్ లో క్లాప్స్ పడ్డాయి.
ఆకట్టుకున్న ఇద్దరు హీరోయిన్లు
ఇక జెర్సీ సినిమాలో ఉద్యోగం పోగొట్టుకున్న భర్త ఉద్యోగాన్ని తిరిగి తెచ్చేందుకు కాస్త కఠినంగా డబ్బు దాస్తూ.. భర్త దుబారా ఖర్చులకు డబ్బు అందకుండా.. తనలో తానే మానసిక సంఘర్షణకు లోనవుతూ.. ఏం మాట్లాడినా.. ఎలాంటి సమాధానం ఇవ్వని భర్తతో అడ్జెస్ట్ అయ్యే పాత్రలో శ్రద్ద శ్రీనాధ్ నటనకు ప్రేక్షకులు కూడా విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. మరి శ్రావణి, సారా పాత్రలలో మధ్యతరగతి భార్యలు తమని తాము ఊహించుకుంటున్నారు అంటే ఆ పాత్రల తాలూకు ఎమోషన్ ఏ రేంజ్ లో పండిందో అర్ధమవుతుంది.