జెర్సీ సినిమాపై అంత పెట్టారా..?

గత రెండు వారాలుగా థియేటర్స్ అన్నీ కళలాడుతున్నాయి. మజిలీ సినిమాతో బాక్సాఫీసు బోర్ ని దూరం చేసిన సమంత – నాగ చైతన్య ఈ సినిమాతో వారూ [more]

Update: 2019-04-15 10:45 GMT

గత రెండు వారాలుగా థియేటర్స్ అన్నీ కళలాడుతున్నాయి. మజిలీ సినిమాతో బాక్సాఫీసు బోర్ ని దూరం చేసిన సమంత – నాగ చైతన్య ఈ సినిమాతో వారూ హిట్ అందుకున్నారు. గత శుక్రవారం చిత్రలహరి సినిమాకి కూడా యావరేజ్ టాక్ వచ్చి మంచి కలెక్షన్ వచ్చాయి. ఇక మూడో వారంలో నాని జెర్సీ బాక్సాఫీసు బరిలోకి దిగుతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ తో జెర్సీ సినిమా మీద క్రేజ్ బాగా పెరిగింది. అందులో నేచురల్ స్టార్ నాని సినిమా అంటే ట్రేడ్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి ఉంటుంది. క్రికెట్ నేపథ్యంతో తెరకెక్కిన జెర్సీ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆ అంచనాలతోనే ఈ జెర్సీ.. నాని గత చిత్రాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ట్రైలర్ బాగుండటంతో…

ఇక అన్నింటికీ మించి నాని జెర్సీ ఓవర్సీస్ హక్కులు 4 కోట్లకు అమ్ముడయ్యాయని… లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ బ్లూ స్కై సినిమాస్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. నేచురల్ స్టార్ గా నానికి యూఎస్ లో మంచి క్రేజ్ ఉంది. అలాగే మార్కెట్ వాల్యూ కూడా బాగున్నప్పటికీ… నాని రెండు గత చిత్రాల ఫ్లాప్స్ తో ఓవర్సీస్ మార్కెట్ కాస్త డల్ అయినా తాజాగా జెర్సీకి 4 కోట్లు రావడం అనేది కాస్త షాకింగ్. అయినా జెర్సీ టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతోనే ఓవర్సీస్ లో జెర్సీకి అంత మంచి రేటొచ్చిందని అంటున్నారు.

Tags:    

Similar News