తారక్ చెప్పిన సలహా పాటించిన కళ్యాణ్ రామ్..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వేరే బ్యానర్స్ లో అవకాశం వచ్చినా తన సొంత బ్యానర్ లోనే సినిమా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాడు. ఈ క్రమంలో [more]

;

Update: 2019-03-01 08:46 GMT
ntr happy with kalyanram 118
  • whatsapp icon

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వేరే బ్యానర్స్ లో అవకాశం వచ్చినా తన సొంత బ్యానర్ లోనే సినిమా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాడు. ఈ క్రమంలో ఆయన చాలా నష్టపోయాడు. ఒక టైంలో బాగా కష్టాల్లో ఉన్నప్పుడు జూనియర్ తనకి ‘జై లవకుశ’ చేసి పెట్టాడు. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు వచ్చినా ప్రొడ్యూసర్ గా కళ్యాణ్ రామ్ లాభపడ్డారు. ఆ తరువాత ప్రొడక్షన్ జోలికి పోలేదు. తనకు బయట కూడా మంచి మార్కెట్ ఉండడంతో రిస్క్ లేకుండా బయట బ్యానర్ లో సినిమాలు చేయాలని తారక్ సలహా ఇచ్చాడట.

118 movie review

ప్రొడక్షన్ వద్దని చెప్పిన తారక్

కొన్నాళ్ల తరువాత మన బ్యానర్ లో నేను సినిమా చేస్తానని… ఈలోగా ప్రొడక్షన్ జోలికి పోవద్దని మాట ఇచ్చాడట తారక్. తమ్ముడు చెప్పడంతో కళ్యాణ్ ప్రొడక్షన్ జోలికి అసలు పోవడం లేదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటించిన 118 చిత్రం తన ఫ్రెండ్ కోనేరు మహేష్ నిర్మించిన చిత్రమే. ఈ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి లాభాలు రాబట్టుకుందని ట్రేడ్‌ వారు చెబుతున్నారు.

Tags:    

Similar News