నాగచైతన్య కారులో సోదాలు.. బ్లాక్ ఫిలిం తొలగింపు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. వై కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులు మినహా మిగతావారెవ్వరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం..

Update: 2022-04-12 05:27 GMT

హైదరాబాద్ : నగర ట్రాఫిక్ పోలీసులు వాహన, ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా అమలు చేసే ప్రయత్నంలో భాగంగా.. వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. వై కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తులు మినహా మిగతావారెవ్వరూ వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదు. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో నగరంలో కొద్దిరోజులుగా బ్లాక్ ఫిలిం ఉన్న వాహనాలను గుర్తించి, బ్లాక్ ఫిలింను తొలగిస్తున్నారు.

ఇటీవలే టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోల వాహనాలకు బ్లాక్ ఫిలింలు తొలగించి, జరిమానాలు విధించారు. తాజాగా యువహీరో అక్కినేని నాగచైతన్య కారును కూడా జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పోలీసులు పరిశీలించారు. అటుగా వెళ్తున్న చైతన్య కారును ఆపి, అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించి, రూ.700 జరిమానా విధించారు. ఆ సమయంలో చైతన్య కారులోనే ఉన్నట్లు తెలిసింది.


Tags:    

Similar News