ఆ పాట చేసే సమయంలో నా కాళ్లు బాగా దెబ్బతిన్నాయి : జూ.ఎన్టీఆర్
ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ..
ఇప్పుడు యావత్ భారత్ చూపంతా ఆస్కార్ అవార్డుల వేడుకపైనే ఉంది. ఎందుకంటే.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీకి మన తెలుగు సినిమా నామినేట్ అయింది. భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయాన్నే ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ మొదలు కానుంది. ఈ వేడుకకోసం ఇప్పటికే RRR బృందం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ RRR ను రీ రిలీజ్ చేసి.. ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవల రామ్ చరణ్ అక్కడ ఓ అమెరికన్ పాపులర్ షో కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా.. ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్ అనే హాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. భాషతో సంబంధం లేకుండా.. సినిమా అనేది ఇప్పుడు గ్లోబల్ అయిపోయింది. ఇండియన్ సినిమా, హాలీవుడ్ సినిమా అని ఏం లేదు ఇప్పుడు. అన్ని సినిమాలు అన్ని చోట్ల ఆడుతున్నాయి. ఒకప్పుడు హాలిడేస్ కోసం లాస్ ఏంజిల్స్ కి వచ్చేవాడిని, ఇప్పుడు ఆస్కార్ కోసం వచ్చాను. ఆస్కార్ వేడుకల్లో నేను ఒక RRR యాక్టర్ గా కంటే, ఇండియన్ యాక్టర్ గా కంటే కూడా ఒక ఇండియన్ గా అడుగుపెడతాను. నా హృదయంలో నేను ఎప్పుడూ ఇండియన్ అయినందుకు గర్విస్తాను అని తెలిపారు.
RRRలో నాటు నాటు పాట గురించి మాట్లాడుతూ.. ఈ పాట షూట్ చేసినన్ని రోజు సెట్ లో బాగా రిహార్సిల్ చేశామన్నారు. డ్యాన్స్ కంటే ముందు.. చరణ్ కి నాకు సింక్ అవ్వడానికే ఎక్కువ ప్రాక్టీస్ చేశాం. అందుకు మాకు చాలా సమయం పట్టేది. అలాగే ఈ పాట సమయంలో నా కాళ్లు బాగా దెబ్బతిన్నాయి అని ఎన్టీఆర్ తెలిపారు.