అదంతా గాసిప్పా?
ఈమధ్యన కొన్ని రోజుల నుండి తమిళ హీరో శింబు తో త్రిష పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో కానీ… సోషల్ మీడియా, వెబ్ మీడియాలో [more]
ఈమధ్యన కొన్ని రోజుల నుండి తమిళ హీరో శింబు తో త్రిష పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో కానీ… సోషల్ మీడియా, వెబ్ మీడియాలో [more]
ఈమధ్యన కొన్ని రోజుల నుండి తమిళ హీరో శింబు తో త్రిష పెళ్లి పీటలెక్కబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో కానీ… సోషల్ మీడియా, వెబ్ మీడియాలో మాత్రం శింబు – త్రిష ల పెళ్లి అంటూ ఒకటే హల్చల్ చేస్తుంది. శింబు హన్సిక, నయనతార లతో ప్రేమాయణం నడిపి పెళ్లి వరకు తీసుకొచ్చాక పెళ్లిని బ్రేకప్ చేసుకుని ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నాడు. మరోపక్క త్రిష కూడా చెన్నైకి చెందిన వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. తర్వాత త్రిష పెళ్లిపై చాలానే వార్తలొచ్చిన… ఎప్పటికప్పుడు త్రిష కండిస్తూనే వచ్చింది.
అయితే తాజాగా శింబు – త్రిష ల పెళ్లి వార్త నిజం కాదని కేవలం రూమర్ అని తెలుస్తుంది. అసలు ఈ పుకారు ఎలా పుట్టిందో ఆనేది శింబుకి కానీ, త్రిష కి కానీ తెలియదట. శింబు – త్రిష లా పెళ్లి అనేది నిజంగా రూమర్ అని.. వాళ్ళు పెళ్లి చేసుకోవడం లేదనేది లేటెస్ట్ న్యూస్. త్రిష చేతి నిండా సినిమాలున్నాయి, అలాగే శింబు మనిరత్నం సినిమా తోనూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఎవరికీ వారు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి సమయం,లోనే త్రిష – శింబు పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అది చివరికి గాసిప్ అని తేలింది.