మరీ రెచ్చిపోతే…. అదే జరుగుతుంది
సినిమాల్లో అడ్డు అదుపు లేకుండా అందాలు ఆరబోసినా, కిస్సింగ్ సీన్స్ తోనూ, హాట్ గా ఘాటుగా రొమాంటిక్ గా రెచ్చిపోతే… విడుదలకు ముందే సెన్సార్ కత్తెరేసేస్తుంది. మరీ [more]
సినిమాల్లో అడ్డు అదుపు లేకుండా అందాలు ఆరబోసినా, కిస్సింగ్ సీన్స్ తోనూ, హాట్ గా ఘాటుగా రొమాంటిక్ గా రెచ్చిపోతే… విడుదలకు ముందే సెన్సార్ కత్తెరేసేస్తుంది. మరీ [more]
సినిమాల్లో అడ్డు అదుపు లేకుండా అందాలు ఆరబోసినా, కిస్సింగ్ సీన్స్ తోనూ, హాట్ గా ఘాటుగా రొమాంటిక్ గా రెచ్చిపోతే… విడుదలకు ముందే సెన్సార్ కత్తెరేసేస్తుంది. మరీ బోల్డ్ గా వున్న సీన్స్ ని సెన్సార్ కత్తిరించి పారేస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్ తమిళంలో నటించిన క్వీన్ విషయంలో అదే జరిగిందనే న్యూస్ కోలీవుడ్ మీడియాలో నడుస్తుంది. అవకాశాలు తగ్గాక గ్లామర్ గా రెచ్చిపోయి నటిస్తున్న కాజల్ కి ఈ మధ్యన తెలుగులో ప్లాప్ మీద ప్లాప్ లు వచ్చిపడ్డాయి. కానీ తమిళనాట కోబలి తో హిట్ కొట్టింది. అయితే కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో నటించిన క్వీన్ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినా.. ఇప్పటికీ ఆ సినిమా విడుదల కాలేదు. కానీ ఆ సినిమాకి తాజాగా సెన్సార్ అవ్వగా.. సినిమాలోని చాలా సీన్స్ కి సెన్సార్ కత్తెరేసిందట. మరి క్వీన్ టీజర్ లోనే కాజల్ చేసిన గ్లామర్ అండ్ అడల్ట్ సీన్స్ రచ్చ మాములుగా లేదాయె..
అయితే క్వీన్ టీజర్ అండ్ ట్రైలర్ లో చాలా తక్కువ ఉన్న ఆ అడల్ట్ కంటెంట్ సీన్స్… సినిమాలో మాత్రం చాలా ఉన్నాయట. అందుకే సెన్సార్ వారు తమ ప్రతాపం చూపించారంటున్నారు. కానీ కాజల్ మాత్రం సెన్సార్ వారు అలా చెయ్యడం బాగోలేదని.. తాము చాలా కష్టపడి సినిమా చేసాం అని, ఒరిజినల్ క్వీన్ సినిమాని ఎలా ఉందొ అచ్చం అలా చేశామని చెబుతుంది. మరి ఒరిజినల్ లో ఎలా ఉంటే అలా తీస్తే సెన్సార్ వారు ఎందుకు తీసేస్తారు. సినిమాలో ఆ అతి ఎక్కువ లేకపోతె సెన్సార్ పనిగట్టుకుని ఆ సినిమా ని చంపాల్సిన అవసరమేమిటి అంటున్నారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.