కాజల్ పెళ్లి? ఎవరితో?

కాజల్ అగర్వాల్ కి పెళ్లంటూ చాలా రోజులుగా వార్తలొస్తున్నప్పటికీ.. కాజల్ ఒప్పుకుంటున్న ప్రొజెక్ట్స్ చూసాక కాజల్ పెళ్లి విషయంలో అవి గాసిప్స్ అనుకున్నారు. కాజల్ అగర్వాల్ కూడా [more]

Update: 2020-10-06 06:41 GMT

కాజల్ అగర్వాల్ కి పెళ్లంటూ చాలా రోజులుగా వార్తలొస్తున్నప్పటికీ.. కాజల్ ఒప్పుకుంటున్న ప్రొజెక్ట్స్ చూసాక కాజల్ పెళ్లి విషయంలో అవి గాసిప్స్ అనుకున్నారు. కాజల్ అగర్వాల్ కూడా లాక్ డౌన్ టైం లో ఖాళీగా ఉంటుంది అనుకున్నారు. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ ఆచార్య షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తుంది. ఎందుకంటే చిరు ఆచార్య ఒపుకున్న కాజల్ అగర్వాల్ చిరు తో నటించేందుకు ఉత్సాహంగా ఉంది. అయితే ఈలోపు కాజాల అగర్వాల్  కి ఓ బిజినెస్ మ్యాన్ తో నిశ్చితార్ధం జరిగింది అంటూ ప్రచారం జరిగింది. ఓ బిజినెస్ మ్యాన్ తో కాజల్ నిశ్చితార్ధం.. త్వరలోనే పెళ్లి అని ప్రచారం జరుగుతున్నా ఈ ముద్దుగుమ్మ మాత్రం పెళ్లి వార్తలపై స్పందించలేదు.

తాజాగా కాజల్ అగర్వాల్ అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఎందుకంటే కాజల్ అగర్వాల్ ఈ బిజినెస్ మ్యాన్ నే పెళ్లాడబోతుంది అంటూ సోషల్ మీడియాలో కాజల్ కి కాబోయే భర్త అంటూ ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. అది ముంబై కి చెందిన గౌతమ్ కిచ్లు అనే బడా వ్యాపార వేత్త ఫోటో. మరి కాజల్ పెళ్లాడబోయేది గౌతమ్ కిచ్లు నే అంటున్నారు. అదే విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కాజల్ కి కాబోయే భర్త డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియల్ డిజైన్ సంస్థను నడుపుతున్నట్లుగా చెబుతున్నారు. కరోనా లాక్ డౌన్ ముగియగానే కాజల్ అగర్వాల్ గౌతమ్ ల పెళ్లి ముంబై లోని ఓ హోటల్ లో కుటుంబ సభ్యుల మధ్యన జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వార్తలపై చందమామ కాజల్ స్పందించాల్సి ఉంది.

Tags:    

Similar News