కాజల్ పాప అప్పటినుండే.. !!

కాజల్ అగర్వాల్ కెరీర్ లో పడిపోతుంది అని అనుకున్నప్పుడల్లా మళ్ళీ ఉవ్వెత్తున లేచే కెరటంలా రెపరపెలాడుతుంది. కెరీర్ మొదలెట్టినప్పుడు కాజల్ ఎంతగా సన్నగా నాజూగ్గా ఉందొ. ఇప్పుడు [more]

Update: 2020-07-28 10:41 GMT

కాజల్ అగర్వాల్ కెరీర్ లో పడిపోతుంది అని అనుకున్నప్పుడల్లా మళ్ళీ ఉవ్వెత్తున లేచే కెరటంలా రెపరపెలాడుతుంది. కెరీర్ మొదలెట్టినప్పుడు కాజల్ ఎంతగా సన్నగా నాజూగ్గా ఉందొ. ఇప్పుడు ఇన్నేళ్లకి కూడా కాజల్ అదే నాజూకు తనంతో కనబడుతుంది. తండ్రి కొడుకులతో, బాబాయ్ అబ్బాయిలల్తో నటించడం అనేది కాజల్ కె సాధ్యం అయ్యింది. అయితే తాజాగా కాజల్ అగర్వాల్ తెలుగులో చిరు ఆచార్య సినిమాలోనూ, తమిళంలో కమల్ హాసన్ భారతీయుడు సినిమాలోనూ నటిస్తుండగా.. మరిన్ని అవకాశాలు కాజల్ తలుపు తట్టే అవకాశం ఉన్నట్లుగా సోషల్ మీడియా ప్రచారం. అయితే కాజల్ చాలా లేత వయసునుండే సంపాదన మొదలు పెట్టిందట. చిన్నప్పటినుండి పిల్లలు ఏమవ్వాలనే లక్ష్యం ఉంటుంది. దానికి ఓ స్పష్టత ఉంటుంది. అయితే ఫ్యూచర్ లో వాళ్ళు అదే చేస్తారా.. లేదా.. అనేది తెలియదు. అలాగే నేను చిన్నప్పుడు ఒకలా అనుకునే దాన్ని.. కానీ తర్వాత చాల గందర గోళానికి గురయ్యే దానిని.

అలాంటి పరిస్థితి నుండే నాకో ఆలోచన వచ్చింది. అసలు నేను ఎలాంటి పని చేస్తే నా మనసుకి తృప్తి నిస్తుంది అని.. ముందు ఎదో ఒక పని చెయ్యాలని డిసైడ్ అయ్యాను. ముందుగా ప్రకటనలు అంటే యాడ్స్, ప్రజా సంబంధాలకు సంబందించిన ఓ కంపెనీ లో చేరాను. అలా నేను 16 ఇయర్స్ నుండే సంపాదించడం నేర్చుకున్నాను. కాలేజ్ కి వెళ్లిన వేసవి సెలవల్లో ఏదో ఒక ఉద్యోగం వెతుకునేదాన్ని. నేను ఏ పనిని బాగా ఇష్టపడతానో తెలుసుకోవడానికే అలా ఉద్యోగాలు చేసేదాన్ని.. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో లోరియల్ ఇండియా ప్రవేట్ లిమిటెడ్ లో చేరాను. అందులో దాదాపుగా పది నెలలు పని చేశాయి.. ఇక ఎంబీఏ లో ఉండగా  సినిమాల్లో అవకాశాలు రావడం తర్వాత హీరోయిన్ గా స్థిరపడడం జరిగింది అని చెబుతుంది కాజల్ అగర్వాల్. అంటే 16 ఏళ్లకే కాజల్ పనిలో ముందుందన్నమాట

Tags:    

Similar News