బిగ్ బాసా.. నేనెలా కనబడుతున్నా?

చాలామంది బిగ్ బాస్ లో అవకాశం వస్తే.. ఫెమస్ అవ్వొచ్చు.. కెరీర్ లో అవకాశాలు పట్టెయ్యొచ్చు అని చూస్తే.. మరికొంతమంది బిగ్ బాస్ అంటే చీడపురుగా అన్నట్టుగా [more]

Update: 2020-09-01 05:09 GMT

చాలామంది బిగ్ బాస్ లో అవకాశం వస్తే.. ఫెమస్ అవ్వొచ్చు.. కెరీర్ లో అవకాశాలు పట్టెయ్యొచ్చు అని చూస్తే.. మరికొంతమంది బిగ్ బాస్ అంటే చీడపురుగా అన్నట్టుగా చూస్తారు. బిగ్ బాస్ హౌస్ అంటే వెళ్లకూడని ప్లేస్ కి వెళ్ళినట్టుగా ఫీలవుతారు. ఎక్కడ తమ నిజ స్వరూపాలు బయటపడతాయో అనే భయం చాలామందిలో ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం క్రేజ్ కోసం, డబ్బు కోసం హౌస్ లోకి వెళ్ళడానికి ఎలాంటి అడ్డు చెప్పరు. తాజాగా ఓ కేరెక్టర్ ఆర్టిస్ట్ ని బిగ్ బాస్ సీజన్ 4 కి వెళుతున్నారట కదా అని అడిగితె ఇంతెత్తున లేచింది.

నేను బిగ్ బాస్ హౌస్ లోకా? మీకెవరు చెప్పారు అంటుంది. ఆమె ఎవరో కాదు కల్పిక గణేష్. హీరోయిన్స్  కి ఫ్రెండ్ గానో, అక్కగానో నటించే కల్పిక ఇప్పటికి కెరీర్ లో నిలబడానికి నానా తంటాలు పడుతుంది. అలాంటి కల్పికని సెప్టెంబర్ 5 నుండి మొదలు కాబోయే బిగ్ బాస్ సీజన్ 4 లో మీరు ఉన్నారట కదా అని అడిగితె… అసలు తనకు బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టే ఆలోచన ఇప్పుడు కాదు ఎప్పుడూ లేదని చెప్పుకొచ్చింది. నా మీద వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలే అని.. ఎందుకంటే నిజంగా తాను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టను అంటూ చెప్పుకొస్తుంది. మరి బిగ్ బాస్ లో జరిగే గొడవలకు భయపడిందో.. లేదంటే నిజంగానే బిగ్ బాస్ లోకి వెళితే చీపైపోతాననుకుంటుందో కదా.. 

Tags:    

Similar News