అచ్చం హరికృష్ణగా కళ్యాణ్ రామ్ భలే సెట్ అయ్యాడే..!

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు భారీ అంచనాల నడుమ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ పాత్రని కళ్యాణ్ రామ్ [more]

Update: 2019-01-05 07:23 GMT

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు భారీ అంచనాల నడుమ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ పాత్రని కళ్యాణ్ రామ్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టిన తర్వాత హరికృష్ణ అకాల మరణం చెందడంతో.. ఎన్టీఆర్ బయోపిక్ లో హరికష్ణ పాత్రని కాస్త నిడివి పెంచినట్లుగా… అందులోనూ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు హరికృష్ణ ఎన్టీఆర్ వెన్నంటే ఉండడం వంటి విషయాలతో హరికృష్ణ పాత్ర ఎన్టీఆర్ బయోపిక్ లో చాలా ఎక్కువ సీన్స్ లో కనబడతాడని అంటున్నారు. అయితే ఎన్టీఆర్(బాలకృష్ణ) కూర్చున్నప్పుడు పక్కనే హరికృష్ణ( కళ్యాణ్ రామ్) ఆయన దగ్గర వంగి మాట్లాడుతున్న లుక్ ఎప్పుడో బయటికి వచ్చింది.

సోషల్ మీడియాలో వైరల్

హరికృష్ణ హావభావాలు, ఆయన మేనరిసిజం, రోషం అన్నీ ఆజానుబాహుడిలా కబడతాయి. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ నుండి హరికృష్ణగా కళ్యాణ్ రామ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అచ్చం హరికృష్ణగా మారిన కళ్యాణ్ రామ్ అంటూ నందమూరి అభిమానులు పండగ చేసేసుకుంటున్నారు. హరికృష్ణ మాదిరిగా సిగరెట్ తో కళ్యాణ్ రామ్ అదరగొడుతున్నాడు. అయితే హరికృష్ణ పాత్ర కథానాయకుడులో కన్నా ఎక్కవగా మహానాయకుడిలోనే ఉంటుందంటున్నారు. ఇక కళ్యాణ్ రామ్ బయోపిక్ లో చిన్న ఫొటో రూపంలో కనబడినా చాలని.. తన తండ్రి పాత్ర తాను పోషిస్తునందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఎప్పటి నుండో చెబుతున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్ కథానాయకుడు ఇంటర్వూస్ లో పాల్గొంటున్నాడు.

Tags:    

Similar News