హిట్ కోసం ఫ్లాప్ హీరోనే నమ్ముకుంది..!

హలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శినికి ఆ సినిమా యావరేజ్ మాత్రమే ఇచ్చింది. హలో సినిమా యావరేజ్ కన్నా.. ఫ్లాప్ [more]

;

Update: 2019-04-10 07:33 GMT
kalyani in bheeshma movie
  • whatsapp icon

హలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శినికి ఆ సినిమా యావరేజ్ మాత్రమే ఇచ్చింది. హలో సినిమా యావరేజ్ కన్నా.. ఫ్లాప్ అనే చెప్పాలి. ఆ సినిమాలో అఖిల్ కి జోడిగా డీసెంట్ క్యారెక్టర్ చేసిన కళ్యాణి.. తనకి టాలీవుడ్ లో బ్రేక వస్తుందని ఆశపడుతోంది. మొదటి విజ్ఞాన్ని దాటలేకపోయిన కళ్యాణి ప్రియాయదర్శిని తన ద్వితీయ విజ్ఞాన్ని ఎలా దాటుతుందో. అసలే ఆమె ఫ్లాప్ హీరో పక్కన నటించింది. ఆరు సినిమాల ఫ్లాప్ లో ఉన్న సాయి ధరమ్ సరసన చిత్రలహరి సినిమాలో కళ్యాణి ఒక హీరోయిన్ గా నటించింది. చిత్రలహరిలో మరో హీరోయిన్ నివేత పేతురేజ్ కూడా నటించింది.

హిట్ వస్తుందా..?

సాయి ధరమ్ పక్కన కళ్యాణి ప్రియదర్శిని మళ్లీ డీసెంట్ క్యారెక్టర్ లోనే నటిస్తుంది. అయితే చిత్రలహరి మీద బయట మంచి అంచనాలే ఉన్నాయి. కామెడీ ఎంటెర్టైనెర్ గా ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల మలిచినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టి యంగ్ హీరోల సరసన అవకాశాలు పట్టాలనే ప్లాన్ లో కళ్యాణి ఉంది. మరి కళ్యాణి కోరికను ఈ ఫ్లాప్ హీరో ఎంతవరకు తీరుస్తాడో చూద్దాం. ఇప్పటివరకు అయితే చిత్రలహరి మీద పాజిటివ్ టాకే ఉంది. సెన్సార్ పాజిటివ్ గా ఉండడం, టీం కూడా ప్రమోషన్స్ లో జోరు చూపిస్తుంది. చూద్దాం ఈ తమిళ కుట్టి రెండో సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో.

Tags:    

Similar News