ఈసారి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కళ్యాణ్ రామ్..!

118 సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ తన తరువాత సినిమాని కూడా లైన్ లో పెట్టేసాడు. కొత్త దర్శకులని, కొత్త కథలని [more]

Update: 2019-03-11 06:38 GMT

118 సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ తన తరువాత సినిమాని కూడా లైన్ లో పెట్టేసాడు. కొత్త దర్శకులని, కొత్త కథలని ఎంకరేజ్ చేస్తున్న కళ్యాణ్ రామ్ మరోసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్త డైరెక్టర్ తో ఎంటర్టైన్ చేయనున్నాడు. కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట్ చెప్పిన కథకు ఓకే చెప్పిన కళ్యాణ్ రామ్ త్వరలోనే దీన్ని సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నాడని టాక్. ఇది సోషియో ఫాంటసీ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇందులో తుగ్లక్ రీబర్త్ లేదా రీఎంట్రీ లాంటి అంశం మిళితమై ఉంటుంది.

స్వంత బ్యానర్ లోనే…

కమర్షియల్ ప్లస్ ఫన్ గా సాగే ఈ సినిమాను కూడా తన సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే నిర్మించనున్నాడు కళ్యాణ్ రామ్. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన స్టార్ కాస్ట్, టెక్నికల్ టీమ్ ను సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్ శ్రీవాస్ ఓ కథ చెప్పాడట. అలానే హారిక హాసిని వారి సితార ఎంటర్టైన్మెంట్స్ లో కూడా కళ్యాణ్ ఓ సినిమా చేయనున్నాడు.

Tags:    

Similar News