విక్రమ్ హిట్ తో కమల్ ఏం చేస్తున్నారంటే?
తనకు చాలా రోజుల తర్వాత హిట్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ కు లగ్జరీ కారును కమల్ హసన్ బహుమతిగా ఇచ్చారు.
విక్రమ్ మూవీ సక్సెస్ తో కమల్ హాసన్ ఉత్సాహంగా ఉన్నారు. తనకు చాలా రోజుల తర్వాత హిట్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ కు లగ్జరీ కారును కమల్ హసన్ బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ఖరీదు కోటి రూపాయలకు పైగానే ఉంటుంది. లోకేష్ కనకగారజ్ తనకు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత బ్లాక్ బస్టర్ ఇచ్చారని కమల్ భావించి ఈ అపురూప కానుకను దర్శకుడికి అందించారు. అంతేకాదు ఆయన ఫుల్ ఖుషీతో ఉన్నారు.
అసిస్టెంట్ డైరెక్టర్లకు....
విక్రమ్ మూవీకి పనిచేసిన వారందరికీ సర్ ప్రైజ్ గిఫ్ట్ లు కమల్ హాసన్ ఇచ్చుకుంటూ పోతున్నారు. విక్రమ్ మూవీకి 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్ లు పని చేశారు. వీరందరికీ అపాచీ ఆర్టీఆర్ 160 బైకులను బహుమతిగా ఇచ్చాడు. బైక్ మార్కెట్ ధర 1.45 లక్షలు. మూవీకి కష్టపడి పనిచేసి తనకు హిట్ ఇచ్చిన వారందరికీ ఏదో ఒక రూపంలో గిఫ్ట్ లు కమల్ ఇస్తున్నారు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.