Kamal Haasan : సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ చేసిన కమల్ హాసన్..

కమల్ హాసన్ చేతులు మీదుగా విజయవాడలోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ జరిగింది.;

Update: 2023-11-10 05:28 GMT
Kamal Haasan, Krishna statue, unveil, Vijayawada
  • whatsapp icon

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గత ఏడాది నవంబర్ 15న 79 ఏళ్ళ వయసులో మరణించిన సంగతి అందరికి తెలిసిందే. కృష్ణ మరణం ఘట్టమనేని ఫ్యామిలీని మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్ ని కూడా తీవ్రంగా బాధించింది. ఆయన మరణించి ఏడాది గడుస్తున్నా ఇంకా కృష్ణని గుర్తు చేసుకుంటూ ఏవో కార్యక్రమాలు చేస్తూనే ఉంటున్నారు. తమ నుంచి దూరమైన తమ సూపర్ స్టార్ ని తమ మధ్యనే పెట్టుకునే ప్రయత్నం చేస్తూ.. కృష్ణ విగ్రహావిష్కరణలు చేస్తూ వస్తున్నారు అభిమానులు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల కృష్ణ సొంత గ్రామం బుర్రిపాలెంలో కూడా ఒక విగ్రహాన్ని అవిక్షరించారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు తప్ప కృష్ణ కుటుంబసభ్యులంతా పాల్గొన్నారు. ఇక ఇప్పుడు తాజాగా విజయవాడలో కూడా ఒక విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో లోకనాయకుడు కమల్ హాసన్ పాల్గొన్నారు. ఆయన చేతులు మీదుగా కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. విజయవాడ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయవాడ గురునానక్ కాలనీలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తమ అభిమాన హీరో విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు కృష్ణ అభిమానులు కమల్ హాసన్ కి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వస్తున్నారు. మరి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆ విగ్రహావిష్కరణ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

కాగా కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 షూటింగ్ ప్రస్తుతం విజయవాడలోనే జరుగుతుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గత రెండు రోజులుగా విజయవాడలో చిత్రీకరణ జరుపుకుంటూ వస్తుంది. అయితే కమల్ ఇవాళే ఈ మూవీ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కమల్ హాసన్ అక్కడే ఉండడంతో ఈ విగ్రహావిష్కరణ ఆయన చేతులు మీదుగా జరిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ విగ్రహావిష్కరణ గురించిన ఏ సమాచారం బయటకి పెద్దగా రాలేదు.


Tags:    

Similar News