‘భారతీయుడు 2’ లో శింబు పాత్ర ఏంటో తెలుసా?
రోబో 2.0 లాంటి సెన్సషనల్ మూవీ తర్వాత శంకర్ డైరెక్షన్ లో ‘భారతీయుడు 2’ సినిమా రూపొందుతుంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో హీరోయిన్ గా [more]
రోబో 2.0 లాంటి సెన్సషనల్ మూవీ తర్వాత శంకర్ డైరెక్షన్ లో ‘భారతీయుడు 2’ సినిమా రూపొందుతుంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో హీరోయిన్ గా [more]
రోబో 2.0 లాంటి సెన్సషనల్ మూవీ తర్వాత శంకర్ డైరెక్షన్ లో ‘భారతీయుడు 2’ సినిమా రూపొందుతుంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఈసినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ వారు దీన్ని భారీ గా నిర్మిస్తున్నారు. కమల్, కాజలే కాకుండా శింబు కూడా ఒక కీలకమైన పాత్రను పోషించనున్నట్టు గత కొన్ని రోజులు నుండి కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.
దాంతో శింబు ఎటువంటి పాత్ర చేయబోతున్నాడు అని ఆసక్తికరంగా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం శింబు ఇందులో కమల్ కు మనవడి నటిచబోతున్నాడని సమాచారం. ‘భారతీయుడు’ లో వృద్ధుడిగా కమలే, తన కొడుకు పాత్రలో కూడా కమలే నటించారు. అయితే ఈసారి ‘సేనాపతి’ మనవడిగా .. ‘చంద్రబోస్’ కొడుకుగా శింబు కనిపిస్తాడని చెబుతున్నారు.
శింబు కెరీర్ లోనే ఇది గుర్తుండిపోయే పాత్ర అవుతుందని చెబుతున్నారు. శంకర్ శింబు పాత్ర ను చాలా డిఫరెంట్ గా మలిచాడని అంటున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని యూనిట్ చెబుతుంది. షూటింగ్ కోసం 8 దేశాల్లోని లొకేషన్స్ ను ఎంపిక చేశారు