బాలీవుడ్ లో కాంచన ఫిక్స్ అయ్యింది..!
తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయిన ‘కాంచన’ చిత్రం బాలీవుడ్ మేకర్స్ కి తెగ నచ్చేసిందట. అందుకే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారు. హారర్ అండ్ [more]
;
తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయిన ‘కాంచన’ చిత్రం బాలీవుడ్ మేకర్స్ కి తెగ నచ్చేసిందట. అందుకే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారు. హారర్ అండ్ [more]
తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయిన ‘కాంచన’ చిత్రం బాలీవుడ్ మేకర్స్ కి తెగ నచ్చేసిందట. అందుకే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారు. హారర్ అండ్ కామెడీ జోనర్ సినిమా కాబట్టి రీమేక్ చేసేందుకు నడుం కట్టారు. ఈ చిత్రం కోసం బాలీవుడ్ వారు నటి కైరా అద్వానీని అప్రోచ్ కాగానే స్క్రిప్ట్ విన్న ఈ అమ్మడు ‘నో’ చెప్పలేకపోయిందట. అలానే ఆర్.మాధవన్ ని అప్ప్రోచ్ అయ్యారట.
డైరెక్టర్ ఎవరో..?
స్క్రిప్ట్ మొత్తం విన్న మాధవన్ ఓకే చెప్పాడని టాక్. ఇక అంతకు ముందే ఈ సినిమాలో నటించడానికి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో భారీ కాస్టింగ్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ నెలలోనే షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. అయితే దీన్ని రాఘవ లారెన్సే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే ఎవరన్నా డైరెక్ట్ చేస్తారనేది సస్పెన్సు లో పెట్టారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది