కంగనా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్

బాలీవుడ్ క్వీన్ కంగనా లేటెస్ట్ మూవీ జ‌డ్జిమెంట‌ల్ హై క్యా నెగటివ్ టాక్ తో నిరాశపరించింది. ఈ మూవీని రాఘవేంద్ర రావు కొడుకు ప్రకాష్ తీశాడు. ఈ [more]

Update: 2019-09-13 08:35 GMT

బాలీవుడ్ క్వీన్ కంగనా లేటెస్ట్ మూవీ జ‌డ్జిమెంట‌ల్ హై క్యా నెగటివ్ టాక్ తో నిరాశపరించింది. ఈ మూవీని రాఘవేంద్ర రావు కొడుకు ప్రకాష్ తీశాడు. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆమెకు ఏమి నష్టం లేదు. ఇందులో ఆమె నటనకు మరిన్ని మార్కులు పడ్డాయి. ఇక ఈ మూవీ తరువాత కంగనా తమిళనాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కే చిత్రంలో న‌టించ‌నుంది. ఈమూవీని విజయ్ డైరక్ట్ చేయనున్నాడు. మన తెలుగు వాడు అయిన విష్ణు ఇందూరి
ఈ మూవీని నిర్మించనున్నాడు.

ఎక్కడా ఆగలేదు….

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నా ఈ సినిమా ఆగిపోయిందని గత కొన్ని రోజులు నుండి వార్తలు వస్తున్నాయి. కానీ అందులో నిజం లేదని ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జోరుగా సాగుతున్న విష‌యాన్ని వెల్ల‌డించాడు విష్ణు. ఈ సినిమాలో కంగనా మేకప్ కోసం హాలీవుడ్ నుండి కెప్టెన్ మార్వెల్, బ్లేడ్ ర‌న్న‌ర్ లాంటి సినిమాల‌కు ప‌ని చేసిన మేక‌ప్‌ మ్యాన్ జేస‌న్ కొలిన్స్‌ను తీసుకొస్తున్నార‌ట‌. ఈయన ఆధ్వర్యంలో టెస్ట్ షూట్స్ జరుగుతున్నాయి.

చతుర ఆకారాల్లో…..

కంగనా ఇందులో నాలుగు ర‌కాల అవ‌తారాల్లో ద‌ర్శ‌న‌మిస్తుంద‌ట‌. ఆమె మేకప్ విషయంలో యేవో ట్రిక్స్ కూడా ఉప‌యోగించి.. జ‌య రూపంలోకి కంగ‌నాను తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. వచ్చే నెలలో ఈమూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈలోగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి సినిమా పై బజ్ తీసుకుని రావాలని చూస్తున్నారు మేకర్స్.

 

 

 

Tags:    

Similar News