అంత అయ్యాక ఇప్పుడు భయ పడిందట
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కి పాజిటివ్ అని తేలడంతో.. ఆమెతో పార్టీలు చేసుకున్నవారి వెన్నులో ఒణుకు పుట్టింది. లండన్ నుండి వచ్చిన కనికా కపూర్ ఓ [more]
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కి పాజిటివ్ అని తేలడంతో.. ఆమెతో పార్టీలు చేసుకున్నవారి వెన్నులో ఒణుకు పుట్టింది. లండన్ నుండి వచ్చిన కనికా కపూర్ ఓ [more]
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కి పాజిటివ్ అని తేలడంతో.. ఆమెతో పార్టీలు చేసుకున్నవారి వెన్నులో ఒణుకు పుట్టింది. లండన్ నుండి వచ్చిన కనికా కపూర్ ఓ ఆల్బమ్ లాంచ్ కోసం విదేశానికి వెళ్ళింది. అయితే అక్కడినుండి వచ్చాక కనికా ఇంటికి పరిమితమవకుండా పార్టీలతో హడావిడి చెయ్యడం తర్వాత ఆమెకి కరోనా రాయడంతో కనికని నెటిజెన్స్ విపరీతంగా ట్రోల్స్ చేసారు. ఇక కనికా కపూర్ లక్నో హాస్పిటల్ డాక్టర్స్ ని కూడా ఆడుకుంది. డాక్టర్స్ తనని సరిగ్గా ట్రీట్ చెయ్యడం లేదని అంటోంది. దానికి డాక్టర్స్ కూడా కనికకి కౌంటర్ వేశారు. తానూ ఓ కరోనా పేషేంట్ ల ఫీల్ కాకపోతే తనకి ట్రీట్మెంట్ చెయ్యడం కష్టమన్నారు. ఇక తాజాగా కరోనా పాజిటివ్ గా తేలిన కనికా కపూర్ నెటిజెన్స్ కామెంట్స్ కి తెగ భయపడిందట.
ఆ విషయాన్నీ ఆమె ఫ్రెండ్ బుల్లితెర నటుడు ఇన్దీప్ భక్షి చెబుతున్నాడు. కరోనా కారణంగా ఓ బుల్లితెర రియాల్టీ షో నిలిచిపోవడంతో బయటికొచ్చిన ఇన్దీప్.. కనికకి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమెపై వచ్చిన కామెంట్స్ కి భయపడ్డా అని.. ఇంతకుముందే ఆమెతో ఫోన్ లో మాట్లాడా అని చెప్పాడు. అయితే ఆమె ఎయిర్ పోర్ట్ నుండి పారిపోయి వచ్చింది అని, ఇంకేదో అని మీడియాలో ప్రచారం జరింగింది. కానీ కనికా లాంటిదేం చెయ్యలేదని.. ఆ విషయమే ఆమె తనకి చెప్పింది అంటున్నాడు. లండన్ నుండి వచ్చిన తనకి రెండు మూడు రోజులు బాగానే ఉన్నప్పటికీ మూడో రోజు జ్వరం రావడంతో సాధారణ జ్వరమే అనుకున్నది అని… కానీ తర్వాత రోజు జ్వర ఎక్కువగా ఉండడంతో స్వయంగా కనికనే హాస్పిటల్ కి వెళ్ళింది అని అంతేకాని అందులో తన తప్పేం లేదని… కరోనా పాజిటివ్ అని తేలాక కనిక తనపై వచ్చిన కామెంట్స్ కి భయపడినట్లుగా ఇండీపీ భక్షి చెబుతున్నాడు.