కరణ్ నుండి దేవరకొండకి 40 కోట్ల ఆఫర్
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ చిత్రం యావరేజ్ సక్సెస్ అందుకోవడంతో మంచి ఆనందం గా ఉన్నాడు హీరో విజయ్. ఇక ఈసినిమా హిందీ లోకి [more]
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ చిత్రం యావరేజ్ సక్సెస్ అందుకోవడంతో మంచి ఆనందం గా ఉన్నాడు హీరో విజయ్. ఇక ఈసినిమా హిందీ లోకి [more]
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ చిత్రం యావరేజ్ సక్సెస్ అందుకోవడంతో మంచి ఆనందం గా ఉన్నాడు హీరో విజయ్. ఇక ఈసినిమా హిందీ లోకి రీమేక్ కూడా అవుతుండంతో ఇంకా ఆనందంగా ఉన్నాడు. రీసెంట్ గా ఈసినిమా హిందీ రైట్స్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కైవసం చేసుకున్నారు. త్వరలోనే ఆయన ఈసినిమాను రూపొందించనున్నారు. తెలుగు సినిమా చూసే అది నచ్చే కరణ్ ఈసినిమాను హిందీ లో రీమేక్ చేయడానికి రైట్స్ కొన్నాడు. కరణ్ అప్పుడు విజయ్ ని కలిసింది కేవలం డియర్ కామ్రేడ్ కోసమే కాదట. విజయ్ ను ఈసినిమాతో ఆయన బాలీవుడ్ లో పరిచయం చేయాలి అనుకున్నాడట. అందుకు విజయ్‌కు రూ.40 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.
మరి ఇందులో నిజం ఎంత ఉందొ కానీ విజయ్ మాత్రం ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. అర్జున్ రెడ్డి హిందీ వర్షన్ లో మొదట హీరోగా విజయ్ నే సంప్రదించారు. నటించిన పాత్రలోనే మరోసారి నటించనని ఆయన చెప్పినట్లు తెలిసింది. రీసెంట్ గా బాలీవుడ్ లో సినిమా చేయడానికి ఛాన్స్ వస్తే చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు. ” నాకు హిందీ లో సినిమాలు చేయాలనీ ఆసక్తే. కానీ నా సినిమా టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ ఒకేసారి రావాలనుకుంటున్నా.నా ఫ్రెండ్స్, ఫ్యామిలి అంత హైదరాబాద్ లో ఉంటె నేను ఒక్కడినే ముంబై లో అపార్ట్‌మెంట్‌కి షిఫ్ట్ కావడం నాకు ఇష్టం లేదు. నాకు స్లో గా లేజీ లైఫ్‌స్టైల్ లో ఇలా ఉండడమే ఇష్టం. ముంబై వేగానికి నేను సరి కాదు. నాకు ఏదైనా సరే స్వతహాగా చేయడం ఇష్టం’ అని అన్నారు. మరి ఫ్యూచర్ సినిమా ఛాన్స్ వస్తే చేసిన చేయొచ్చు విజయ్.