విజయ్ లో ఏం చూశావయ్యా

విజయ్ దేవరకొండ క్రేజ్ ని టాలీవుడ్ లో ఎవరు ఉపయోగించుకున్నారో తెలియదు కానీ.. బాలీవుడ్ లో మాత్రం విజయ్ దేవరకొండ క్రేజ్ కి కరణ్ జోహార్ పడి [more]

Update: 2020-03-06 07:01 GMT

విజయ్ దేవరకొండ క్రేజ్ ని టాలీవుడ్ లో ఎవరు ఉపయోగించుకున్నారో తెలియదు కానీ.. బాలీవుడ్ లో మాత్రం విజయ్ దేవరకొండ క్రేజ్ కి కరణ్ జోహార్ పడి చచ్చిపోతున్నాడు. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ఎవరికి ఎక్కవ టాలెంట్, క్రేజ్ ఉంటే వాళ్ళని వదలడని తెలుసు కానీ… మరీ ఇంతగా విజయ్ దేవరకొండ క్రేజ్ కి ఫిదా అయ్యి భారీగా నమ్మకం పెట్టుకోవడం కాస్త విడ్డురమయినా విజయ్ దేవరకొండ పంట మాత్రం పండుతుంది. పూరి తో సినిమాని పాన్ ఇండియా ఫిలిం చెయ్యడానికి కరణ్ జోహార్ కారణం. విజయ్ మీద నమ్మకంతో ఆ సినిమాని పాన్ ఇండియా ఫిలిం గా మార్చాడు. విజయ్ క్రేజ్ ఎవరికీ దక్కకుండా కరణ్ ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ చేస్తున్నాడనే టాక్ బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

అందులో భాగంగానే విజయ్ దేవరకొండ తో ఏడాది ఓ సినిమా అనే భారీ డీల్ ని కరణ్ జోహార్ సెట్ చేసుకుంటున్నాడని, ఏడాదికి ఓ బాలీవుడ్ మూవీలో విజయ్ దేవరకొండ నటించేలా డీల్ మట్లాడుకుంటున్నాడని అందుకోసం విజయ్ దేవరకొండ పైకి ఏకంగా 100 కోట్ల ఆఫర్ కూడా ఇచ్చినట్లుగా ప్రచారం షురూ అయ్యింది. విజయ్‌ దేవరకొండ కి తెలుగులో ఎన్ని ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నప్పటికీ.. కరణ్ బాలీవుడ్ కి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి సినిమాకు ఓకే చేయాల్సి ఉంటుంది. ఇక ఆలా చేస్తే ఏడాదికి 100 కోట్లు విజయ్ దేవరకొండ కి గిట్టుతాయని కరణ్ విజయ్ ని అడిగినట్లుగా టాక్. విజయ్ దేవరకొండ క్రేజ్ ని నేషనల్ వైడ్ గా వాడాలని కరణ్ ఫిక్స్ అవడంతో.. విజయ్ తో ఇలాంటి భారీ డీల్ ని విజయ్ ముందు పెట్టినట్లుగా తెలుస్తుంది. మరి 100 కోట్ల డీల్ కి విజయ్ ఎందుకు ఒప్పుకోడు.. ఎంచక్కా ఒప్పుకుంటాడు.

Tags:    

Similar News