కరాటే కల్యాణి చట్టబద్ధంగానే పిల్లల్ని పెంచుకుంటోంది : తల్లి విజయలక్ష్మి

Update: 2022-05-15 13:12 GMT

హైదరాబాద్ : టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి ఇంటిపై ఆదివారం మధ్యాహ్నం చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. కరాటే కల్యాణి పలువురు చిన్నారులను కిడ్నాప్ చేయడంతో పాటు.. 2 నెల పిల్లల్ని కొనుగోలు చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో..ఎస్ ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని రాజీవ్ నగర్లో ఉన్న ఆమె నివాసంపై దాడులు నిర్వహించారు. ఈ ఘటనపై ఆమె తల్లి విజయలక్ష్మి స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. నా కూతురు కరాటే కల్యాణి ఏ పిల్లల్నీ కిడ్నాప్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

తనకు పిల్లలంటే ఇష్టమని, అందుకే 12 ఏళ్లుగా ఒక బాబును పెంచుకుంటోందని విజయలక్ష్మి తెలిపారు. అలాగే గతేడాది డిసెంబర్ 25న పుట్టిన పాపను ఎవరో వదిలేస్తే.. 28న తాను తెచ్చుకుని పెంచుకుంటోందన్నారు. కల్యాణికి ఆడపిల్లలంటే ఇష్టమని, అందుకే పాపను తానే పెంచుకుంటానని చెప్పిందని, ఇదంతా చట్టబద్ధంగానే జరిగిందన్నారు. అనాధల పట్ల కల్యాణి ఎంతో ప్రేమగా ఉంటుందని విజయలక్ష్మి చెప్పారు. సామాజిక సేవ చేయాలని నిత్యం తపన పడుతూ ఉంటుందని, కరోనా సమయంలోనూ ఎంతోమంది పేదలకు తానే స్వయంగా వంటచేసి పెట్టిందన్నారు.








Tags:    

Similar News