కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న కేజీఎఫ్ 2..
ఒక వేళ KGF : చాప్టర్ -2 ఇప్పుడు రూ.20 కోట్ల మార్క్‌ను దాటగలిగితే, ఈ చిత్రం 'బాహుబలి: ది కన్‌క్లూజన్, ఉరీ-ది సర్జికల్ స్ట్రైక్ తర్వాత మూడవ
హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీల వద్ద KGF : చాప్టర్-2 రాకార్డులు సునామీ సృష్టిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇక చెప్పనవసరం లేదు. సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన అన్ని భాషలో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తుంది. KGF : చాప్టర్-2 చిత్రం ఇప్పటికే అన్ని భాషల్లో ది బెస్ట్ రికార్డులను సొంతం చేసుకోగా బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1160 కోట్లు కొల్లగొట్టింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, షారుక్ సినిమాల ఆల్ టైం రికార్డులను బద్దలు కొడుతూ రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పుడు ఎవరి నోట విన్నా సలాం రాఖీబాయి అనే పదం వినిపిస్తోంది. ఈ చిత్రం విడుదలై నాలుగు వారాలు దాటినా కలెక్షన్ల విషయంలో ఏమాత్రం జోరు తగ్గడం లేదు.
ఒక వేళ KGF : చాప్టర్ -2 ఇప్పుడు రూ.20 కోట్ల మార్క్‌ను దాటగలిగితే, ఈ చిత్రం 'బాహుబలి: ది కన్‌క్లూజన్, ఉరీ-ది సర్జికల్ స్ట్రైక్ తర్వాత మూడవ అత్యధిక నాలుగవ వారం కలెక్షన్‌లను కలిగిన సినిమా లిస్టులోకి కేజీఎఫ్ చేరనుంది. 'KGF: చాప్టర్ 2' హిందీ బెల్ట్‌లోని ఏ సినిమాకైనా అత్యధిక ఓపెనింగ్ డే, ఓపెనింగ్ వీకెండ్, ఓపెనింగ్ వీక్‌ని క్లెయిమ్ చేసింది. రూ.250 కోట్ల బెంచ్ మార్క్‌ను అత్యంత వేగంగా చేరుకున్న చిత్రంగా 'KGF: చాప్టర్ 2' నిలిచింది. ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' హిందీలో రూ.510.99 కోట్లు వసూలు చేయగా, 'దంగల్' బాక్సాఫీస్ వద్ద తన జీవిత కాలంలో రూ.387.38 కోట్లు వసూలు చేసింది. మొత్తం మీద KGF: చాప్టర్ -2 ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తుందనే చెప్పాలి.